తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

అద్దె ఇళ్లలో సెలబ్రిటీలు - రెంట్​కు ఇచ్చేది కూడా సినీ తారలే! - Celebrities Living In Rental Houses - CELEBRITIES LIVING IN RENTAL HOUSES

Celebrities Who Live In Rental Houses : సెలబ్రిటీలు కూడా కొన్ని సార్లు అద్దె ఇంట్లో ఉండేందుకు ఇష్టపడుతుంటారు. మరికొందరైతే తమ కో స్టార్స్​కు రెంట్​కు ఇస్తుంటారు. మరీ సినీ ఇండస్ట్రీలో అద్దెకు ఉంటున్న నటీనటుల గురించి ఈ స్టోరీలో చదివేయండి.

Celebrities Who Live In Rental Houses
Celebrities Who Live In Rental Houses (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Jul 5, 2024, 10:47 AM IST

Celebrities Who Live In Rental Houses : బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తాజాగా తన ఇంటిని యంగ్ హీరో వరుణ్ ధావన్​కు అద్దెకు ఇవ్వనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. ముంబయిలోని సీ ఫేసింగ్​లో ఉన్న ఈ ఫ్లాట్​కు వరుణ్​ భారీ మొత్తంలో అద్దె చెల్లించి ఉండేందుకు నిశ్చయించుకున్నారట. దీంతో అందరూ ఒక్కసారిగా షాకరయ్యారు. ఎంటి సెలబ్రిటీలు కూడా అద్దె ఇంట్లో ఉంటారా అంటూ పలువురు నెట్టింట కామెంట్లు పెట్టడం మొదలెట్టారు. అయితే ఇప్పటికీ కొంతమంది సెలబ్రిటీలు రెంటెడ్ హౌస్​లో నివసిస్తున్నారు. మరీ వారవరో ఓ లుక్కేద్దామా.

ఇమ్రాన్ ఖాన్ :మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్​ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ కూడా అద్దె ఇంట్లో నివసిస్తున్నారట. త అయిన లేఖ వాషింగ్టన్‌తో కలిసి కరణ్ జోహార్ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. బాంద్రా కార్టర్ రోడ్‌లోని మూడంతస్థుల బిల్డింగ్‌కు నెలకు రూ.9లక్షలు చొప్పున మూడేళ్లకు అద్దెకు తీసుకున్నాడు. ఈ నిమిత్తం రూ.27 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ కూడా చెల్లించాడట.

కార్తిక్ ఆర్యన్ :తన కో స్టార్ షాహిద్ కపూర్‌కు చెందిన జుహూ అపార్ట్‌మెంట్‌లోని ఒక ప్లాట్‌లో రెంట్​కు ఉంటున్నారట బాలీవుడ్ స్టార్ హీరో కార్తిక్. దాని కోసం ఆయన నెలకు రూ.7.5లక్షల అద్దె చెల్లిస్తున్నారట. సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.45లక్షలు కూడా చెల్లించారట.

కృతి సనన్ : జుహులోని అమితాబ్ బచ్చన్‌కు చెందిన డూప్లెక్స్ హోమ్‌ను రెంట్‌కు తీసుకున్నారు హిందీ నటి కృతి. రూ.60లక్షల సెక్యూరిటీ డిపాజిట్ చేసి, నెలకు రూ.10లక్షల అద్దె చెల్లిస్తున్నారట.

అదితీ రావు హైదరి : అదితి కూడా ముంబయిలో అద్దె ఇంట్లోనే నివసిస్తున్నారు. బీటౌన్ బ్యూటీ మలైకా అరోరాకు చెందిన ఓ ఫ్లాట్​ను ఆమె రెంట్​కు తీసుకున్నారట. దీనికిగాను ఆమె నెలకు రూ.2.31లక్షల అద్దె చెల్లిస్తున్నారని సమాచారం. అంతే కాకుండా మూడేళ్లకు గానూ రూ.20 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ కూడా చేశారట.

జాక్వెలిన్ ఫెర్నాండేజ్ : బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ 2021లోనే తన కో స్టార్ ప్రియాంక చోప్రాకు చెందిన రూ.7కోట్ల ఇంటికి షిఫ్ట్ అయ్యారు. 'కర్మయోగ్' అనే పేరుగల ఈ ఖరీదైన బిల్డింగులో అద్దెకు ఉండేందుకు ఆమె నెలకు సుమారు రూ.6.78లక్షల అద్దె చెల్లిస్తున్నారని సమాచారం.

రిస్క్ చేస్తున్న మీడియం రేంజ్​ హీరోలు - ఎవరంటే? - Tollywood Tier 2 and 3 Heroes

'నా అంత అందవికారంగా చిత్ర పరిశ్రమలో ఎవరూ లేరు!'

ABOUT THE AUTHOR

...view details