Bramhamudi Serial Appu Career : 'బ్రహ్మముడి సీరియల్'లో అప్పు గురించి చాలా మంది బుల్లితెర ప్రేక్షకులకు తెలిసే ఉంటుంది. ఆమె అసలు పేరు నైనీషా రాయ్. సినిమాలపై మక్కువతో బెంగాలీ నుంచి టాలీవుడ్‌కు వచ్చి ఇక్కడే రాణించేలా ప్రయత్నాలు చేస్తోంది. అయితే సినిమాల్లోకి వెళ్తానంటే ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదట. అందుకే ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వచ్చేసి ఇక్కడే ఉంటున్నట్లు తెలిపింది. అనేక కష్టాలను ఎదుర్కొంటున్నట్లు పేర్కొంది. అలా కలిసి ఉంటే కలదు సుఖం, భాగ్య రేఖ, వంటలక్క, హంసగీతం, ఇంటిగుట్టు వంటి సీరియల్స్‌లలో ఆఫర్లు అందుకుందట. ఇక శ్రీమంతుడు అనే సీరియల్‌లో లీడ్ రోల్‌లో చేస్తోంది.
Bramhamudi Serial Appu Serial Offers :తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది నైనీషా రాయ్. తన కెరీర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపింది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్తలో కనీసం తినడానికి తిండి కూడా లేదని చెప్పింది. ఆకలి తీర్చుకునేందుకు ఓ దశలో తన రక్తాన్ని కూడా అమ్ముకున్నట్లు చెప్పి ఎమోషనల్ అయింది. ఎన్నో కష్టాలు పడ్డాను. ఆ సమయంలోనే పలు ఆఫర్లు వచ్చాయి. అయితే ఆఫర్లు ఇచ్చేవారు అవకాశం ఇస్తే నాకేంటి అంటూ తిరిగి అడిగేవారు. కమిట్‌మెంట్ ఇవ్వాలని కండీషన్ పెట్టారు. ఒకానొక సమయంలో బలవంతం కూడా చేశారు. ఆ సమయంలో వాళ్లను కొట్టి ఏదోలా తప్పించుకున్నాను అని పేర్కొంది.