Bollywood Heroine With Huge Following : స్టార్ కిడ్స్‌కు సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం చాలా సులువు అని చాలా మంది అనుకుంటుంటారు. వాళ్లకి ఎంత ఫేమ్ వచ్చినా, గుర్తింపు దక్కినా, ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చినా అదంతా వాళ్లకు ఎంట్రీ వరకూ మాత్రమే. ఆ తర్వాత నుంచి వాళ్లు తమ ట్యాలెంట్‌తో ఈ ఫీల్డ్‌లో స్వయంగా రాణించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఎంతో మంది స్టార్ కిడ్స్ తమ నటనతో మెప్పించి ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. గెలుపోటములను లెక్కచేయకుండా వరుస సినిమాలు చేస్తున్నారు. ఆమె ఎవరంటే ?
బాలీవుడ్ సీనియర్ నటుడు శక్తి కపూర్ గారాల పట్టి శ్రద్ధా కపూర్. 2010లో విడుదలైన 'తీన్ పత్తి' అనే మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమాతోనే అమితాబ్ బచ్చన్, బెన్ కింగ్స్లే లాంటి స్టార్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. కానీ ఈ చిత్రం ఆశించిన స్థాయిలో టాక్ అందుకోలేకపోయింది. దీంతో శ్రద్ధాకు నిరాశ తప్పలేదు. అయినప్పటికీ ఆ తర్వాతి సినిమాతో తానేంటో నిరూపించుకుంది. 2013లో వచ్చిన 'ఆషికీ 2'లో ఫీమేల్ లీడ్‌లో మెరిసింది. తన నటనతో ఆడియెన్స్‌ను మెప్పించింది. ఏమోషనల్ సీన్స్‌లో ఒదిగిపోయి అందరినీ ఏడిపించింది. అయితే ఈ సినిమా బీటౌన్ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ అందుకుంది. అయినప్పటికీ శ్రద్ధా యాక్టింగ్‌కు మంచి మార్కులు పడ్డాయి.
ఆ తర్వాత 'ఏక్ విలన్', 'హైదర్', 'బాఘీ', 'చిచ్చోరే','స్త్రీ', 'తూ ఝూతీ మైన్ మక్కర్ 'లాంటి సినిమాల్లో కనిపించి ఆకట్టుకుంది. కానీ ఆమె ఖాతాలో ఒక్క కమర్షియల్ హిట్ కూడా పడలేదు. అయితే సినిమా ఫలితాలు ఎలా ఉన్నా ఇన్నేళ్లుగా బాలీవుడ్లో ఈమె లీడింగ్ పాత్రల్లోనే కనిపిస్తున్నారు.