Goodachari 2 Emraan Hashmi Injured : బాలీవుడ్ ప్రముఖ నటుడు ఇమ్రాన్ హష్మీ తాజాగా గాయపడ్డారు. అడివి శేష్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న 'జీ 2' మూవీకి సంబంధించి యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
తాజాగా షూటింగ్ సమయంలో ప్రమాదవశాత్తూ ఇమ్రాన్‌కు కుడి దవడ కింది భాగంలో గాయమైంది. దీంతో పెద్ద గాటు పడింది. ఈ విషయాన్ని ఇమ్రాన్ వ్యక్తిగత సిబ్బంది వెల్లడించారు. అయితే దీనికి సంబంధించిన ఫొటోలు కూడా బయటకి రావడం వల్ల అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు.
కాగా, టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ హీరోగా 'గూఢాచారి 2' తెరకెక్కుతోంది. వినయ్ కుమార్ సిరిగినీడి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా రూపొందిస్తున్నారు. సూపర్ హిట్ గూఢఛారి చిత్రానికి సీక్వెల్‌గా ఇది రానుంది. బనితా సింధు హీరోయిన్గా నటిస్తోంది. ఈ స్పై థ్రిల్లర్‌లో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రాని కన్నా ముందే ఆయన తెలుగులో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లీడ్ రోల్లో డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తున్న 'ఓజీ' చిత్రంలో ప్రతినాయకుడి పాత్రకు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది.