తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

బిగ్​బాస్​ ఇంట్లోకి తుపాన్​లా రాబోతున్న "వైల్డ్​ కార్డ్స్"​ - వాళ్లు వీళ్లేనా? - Bigg Boss 8 Wild Card Entries

బిగ్​బాస్​లో వైల్డ్​ కార్డ్ ఎంట్రీస్​ ఫీవర్​ నడుస్తోంది. ఇంతకీ ఇంట్లోకి వచ్చే వాళ్లు ఎవరో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Bigg Boss 8 Telugu Wild Card Entries
Bigg Boss 8 Telugu Wild Card Entries (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 5, 2024, 6:56 PM IST

Bigg Boss 8 Telugu Wild Card Entries:బిగ్‌బాస్‌ 8వ సీజన్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ అన్‌లిమిటెడ్‌ అన్నారు. కానీ హౌజ్​మేట్ల గిల్లికజ్జాలు, అలకలు చూస్తుంటే ప్రేక్షకులకు కూడా అసహనం అన్‌లిమిటెడ్‌గానే వస్తోంది. ఈ క్రమంలోనే ఆడియన్స్​ను ఎంటర్​టైన్​ చేసేందుకు బిగ్‌బాస్‌ టీమ్‌ వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీలను దింపుతోంది. మొత్తంగా ఎనిమిది మందిని ఇంట్లోకి పంపిస్తున్నారని.. ఇప్పటికే వారి షూట్​ కంప్లీట్​ అయినట్లు సమాచారం. ఇంతకీ వారు ఎవరో ఇప్పుడు చూద్దాం..

సెప్టెంబర్​ 1న గ్రాండ్​గా లాంఛ్​ అయిన బిగ్​బాస్​ సీజన్​ 8లో మొత్తం 14 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. అందులో బేబక్క, శేఖర్​ బాషా, అభయ్​ నవీన్​, సోనియా ఆకుల, ఆదిత్య ఎలిమినేట్​ అయ్యారు. ఈ ఆదివారం మరొకరు ఎలిమినేట్​ కానున్నారు. ఇదిలా ఉంటే వైల్డ్​ కార్డ్స్​ ఎంట్రీస్​పై అటు కంటెస్టెంట్లు, ఇటు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ నెలకొంది. అంతేకాకుండా నేటి ఎపిసోడ్లో నాగార్జున కూడా" తుఫాను రాబోతోంది. వైల్డ్ కార్డ్స్ ఒకరి తర్వాత ఒకరు రానున్నారు. మీరు వైల్డ్‌గా లేకపోతే వాళ్లను తట్టుకోలేరు" అంటూ కంటెస్టెంట్లను మరింత టెన్షన్​కు గురిచేశారు.

వైల్డ్​ కార్డ్​ ఎంట్రీస్​ లిస్ట్​ చూస్తే:

హరితేజ:ఎన్టీఆర్ హోస్ట్​గా వ్యవహరించిన బిగ్​బాస్ తెలుగు 1లో అవకాశం దక్కించుకుంది. స్ట్రాంగ్ కంటెస్టెంట్​గా మారి 3వ స్థానంలో నిలిచింది. అయితే ఈ లేడీ ఇప్పుడు సీజన్​ 8లో పాల్గొననుందని సమాచారం.

రోహిణి: బిగ్​బాస్ తెలుగు సీజన్ 3లో పాల్గొన్న రోహిణి.. తన మార్క్ గేమ్​తో ప్రేక్షకులకు ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే నాలుగో వారం ఎలిమినేట్ అయ్యింది. దీంతో తిరిగి సీజన్ 8లో కంటెస్ట్ చేయనుందట ఈ లేడీ కమెడియన్​.

అవినాష్​:బిగ్​బాస్​ సీజన్ 4 కంటెస్టెంట్స్​లో ముక్కు అవినాష్ ఒకరు. ఆ సీజన్​లో కూడా వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చాడు. అతడి బాడీ లాంగ్వేజ్, జోక్స్ నవ్వులు పూయించేవి. అవినాష్ అంచనాలకు మించి రాణించాడు. పది వారాలకు పైగా హౌజ్​లో ఉన్నాడు. అయితే ముక్కు అవినాష్ బిగ్​బాస్ తెలుగు సీజన్ 8లో పార్టిసిపేట్ చేస్తున్నాడు అనేది తాజా న్యూస్.

గౌతమ్ కృష్ణ:సీజన్​ 7లో పాల్గొన్న గౌతమ్​.. తొందరగానే ఎలిమినేట్​ అయ్యి సీక్రెట్​ రూమ్​కి వెళ్లాడు. ఆ తర్వాత వైల్డ్​ కార్డ్​ బ్యాచ్​తో ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ సీజన్​లో కూడా వైల్డ్​ కార్డ్​ ద్వారా హౌజ్​లోకి వచ్చేందుకు ఓకే చేసినట్లు టాక్​.

నయని పావని: సీజన్​ 7 లో వైల్డ్​కార్డ్​ ద్వారా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన నయని.. మొదటి వారంలోనే ఎలిమినేట్​ అయ్యింది. దీంతో ఈ సీజన్​లో మరోసారి వైల్డ్​కార్డ్​ ద్వారా ఇంట్లోకి వచ్చేందుకు సిద్ధమైందని టాక్​..

టేస్టీ తేజ: సీజన్ 7 లో పార్టిసిపేట్ చేసిన మరొక కంటెస్టెంట్ టేస్టీ తేజ. ఎలాంటి అంచనాలూ లేకుండా అడుగుపెట్టిన టేస్టీ తేజా ఎంటర్టైనర్​గా పేరు తెచ్చుకున్నాడు. ఇతని పేరు సైతం వైల్డ్ కార్డు ఎంట్రీ ఇస్తున్న కంటెస్టెంట్స్ లిస్ట్​లో ఉందని సమాచారం.

గంగవ్వ: సీజన్​ 4లో పార్టిసిపేట్​ చేసిన గంగవ్వ.. సీజన్​ 8లో వైల్డ్​ కార్డ్​ ద్వారా రానున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే.. గంగవ్వ ప్లేస్​లో సీజన్​ 3 పార్టిసిపేట్​ వితికా వస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఇద్దరిలో ఎవరు రానున్నారో చూడాల్సిందే.

మెహబూబ్​: బిగ్ బాస్ సీజన్ 4 లో ఎలిమినేట్ అయిన మెహబూబ్ దిల్ సే కూడా సీజన్ 8 లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వనున్నారు. సీజన్​ 4లో టాస్కులు ఆడి స్ట్రాంగ్​ కంటెస్టెంట్​గా పేరు తెచ్చుకున్నాడు బిగ్​బాస్​..

ఎప్పుడంటే:ఈ సీజన్​లో "బిగ్​బాస్​ రీలోడ్​ ఈవెంట్"​ పేరుతో వైల్డ్​ కార్డ్​ ఎంట్రీలను హౌజ్​లోకి పంపించనున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు రేపు(అక్టోబర్​ 6) హౌజ్​లోకి అడుగు పెట్టనున్నారు.

ఫస్ట్ వైల్డ్​ కార్డ్​ ఎంట్రీ ఇతనిదే - ఫొటో రిలీజ్​ చేసిన బిగ్​బాస్ - ఎవరో గుర్తుపట్టగలరా?

సెకండ్​ వైల్డ్​ కార్డ్​ ఎంట్రీ ఫొటో రిలీజ్​​ - ఎవరో గుర్తుపట్టగలరా?

బిగ్​బాస్​ 8 : లవ్​ మ్యాటర్​ రివీల్​ చేసిన ​నబీల్ - పార్ట్​నర్​ ఆమేనటగా!

ABOUT THE AUTHOR

...view details