తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

"ఒకసారి క్రష్, ఒకసారి అక్కా" గౌతమ్​పై యష్మీ సీరియస్​ - నామినేషన్లలో పెద్ద ట్విస్ట్​ ఇచ్చిన బిగ్​బాస్​! - BIGG BOSS 8 NINTH WEEK NOMINATIONS

-తొమ్మిదో వారం నామినేషన్లలో బిగ్​ ట్విస్ట్​ -నామినేట్​ చేసి అధికారం మెగా చీఫ్​ విష్ణుప్రియకు మాత్రమే

Bigg Boss 8 Ninth Week Nominations
Bigg Boss 8 Ninth Week Nominations (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 28, 2024, 5:21 PM IST

Bigg Boss 8 Ninth Week Nominations:బిగ్‌బాస్ హౌజ్​లో ఆదివారం నాడు ఎలిమినేషన్​ పూర్తవడంతో.. సోమవారం 9వ వారం నామినేషన్స్‌ ప్రక్రియ మొదలైంది. అయితే ఈసారి ఓ భారీ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్. దీంతో హౌజ్​లో మాములు గొడవ జరగలేదు. ఈ సమయంలో పృథ్వీ, యష్మీ, గౌతమ్‌ మధ్య డైలాగ్ వార్ నడిచింది. మరి లేటెస్ట్ ప్రోమోలో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.

తొమ్మిదో వారం నామినేషన్స్ ప్రక్రియ మొదలుపెట్టాడు బిగ్​బాస్​. అయితే గత ఎనిమిది వారాల నుంచి కంటెస్టెంట్లు నామినేట్​ చేయగా.. ఇప్పుడా పవర్​ను మెగాచీఫ్​కు ఇచ్చాడు బిగ్​బాస్​. అంటే కేవలం విష్ణుప్రియ మాత్రమే నామినేట్​ చేయాలి. "ఇప్పటి నుంచి వారాలు గడిచే కొద్దీ ఆట మరింత కఠినతరం కాబోతుంది. మీ ప్రయాణంలో ఈరోజు జరగబోయే నామినేషన్స్ అత్యంత ముఖ్యమైనవి. మెగా చీఫ్ విష్ణుప్రియ.. ఇంట్లోవారి ప్రయాణాన్ని మరింత ముందుకు కొనసాగించడానికి అనర్హులని భావించే ఐదుగురు సభ్యులని నామినేట్ చేసి ఒక్కొక్కరినీ జైల్లో పెట్టి తాళం వేయండి" అంటూ బిగ్‌బాస్ చెప్పాడు.

ఇక బిగ్‌బాస్ ఇలా చెప్పగానే విష్ణుప్రియ భారీ షాకిస్తూ.. గౌతమ్‌ను మొదటిగా నామినేట్ చేసింది. తనని నామినేట్ చేయగానే "ఇదే పాయింట్ చెప్పి ఇక ప్రతి వారం అందరూ నన్ను నామినేట్ చేస్తారా?.. దీని గురించి నాకు ఓ క్లారిటీ కావాలి" అంటూ గౌతమ్ అడిగాడు. అలానే "నా కంటే తక్కువ పనిచేసేవాళ్లు.. నా కంటే ఎక్కువ పాయింట్స్ ఉన్నోళ్లు నీ చుట్టూ ఉన్నా కూడా వాళ్లని నువ్వు నామినేట్ చేయవు" అంటూ గౌతమ్ డైలాగ్ వేశాడు.

బిగ్ బాస్ 8: అర్ధరాత్రి గంగవ్వకు గుండెపోటు - తీవ్రంగా భయపడ్డ కంటెస్టెంట్లు - అప్​డేట్​ ఇచ్చిన నిర్వాహకులు!

దీంతో "ఎందుకు నువ్వు ఇందాకటి నుంచి ఒకే వ్యక్తి గురించి లేడు లేడు అంటూ చెబుతున్నావ్" అంటూ విష్ణుప్రియ సీరియస్​ అయ్యింది. ఇదే విషయంలో గౌతమ్‌తో.. "ఇక్కడ నీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పకు.. అలా అయితే నేనూ చెప్పాల్సి ఉంటుంది" అంటూ యష్మీ అంది. దీనికి "నువ్వు ఆగక్కా" అంటూ గౌతమ్ అన్నాడు. దీంతో యష్మీ ఫైర్ అయింది. "నన్ను అక్కా అని పిలవకు.. యష్మీ అని పిలువు.. ఒకసారి క్రష్, ఒకసారి అక్కా" అని పిలవకు అంటూ యష్మీ ఫైర్​ అయ్యింది.

ఇక గౌతమ్‌ని తీసుకొని జైల్లో వేయగానే పృథ్వీ నవ్వాడు. దీంతో గౌతమ్‌కి గట్టిగా కాలి.. "రేయ్ మస్త్ నవ్వొస్తుందిలే కాకా నీకు" అంటూ గౌతమ్ అంటే "నువ్వు ఒక పర్సన్ ఒక పర్సన్ అని చెబుతున్నావ్.. వాళ్ల పేరు చెప్పే దమ్ము నీకు లేదు" అంటూ పృథ్వీ అన్నాడు. దీనికి "నువ్వెవరూ నాకు దమ్ము లేదు అనడానికి" అంటూ గౌతమ్ అంటే "నేను అంటా" అని పృథ్వీ రెచ్చగొట్టాడు. దీంతో "రా దగ్గరికి రా ఎంత దమ్ముందో చూపిస్తా. నీ పేరు చెప్పానా.. ఎందుకు నువ్వే లేస్తున్నావ్. డిఫెన్స్ లాయరా.. తియ్ ఈ లాక్ తియ్ ముందు" అంటూ గౌతమ్ రెచ్చిపోయాడు. అయితే సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్న ప్రకారం.. నామినేషన్స్​లో గౌతమ్​, టేస్టీ తేజ, నయని పావని, హరితేజ, యష్మీ ఉన్నట్లు టాక్​..

"తమ్ముడంటే జెలస్​ - త్వరలోనే స్ట్రెయిట్ తెలుగు సినిమా" - బిగ్​బాస్​లో హీరో సూర్య సందడి!

"పక్కనోళ్ల బాధ గురించి వాడికి అక్కర్లేదు" - "వాడికి అదే సమస్య" - నాగ మణికంఠ చెల్లెలు షాకింగ్​ కామెంట్స్​!

ABOUT THE AUTHOR

...view details