తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

బిగ్​ బాస్​లో లవ్​ బర్డ్స్! - వాళ్ల మధ్య లవ్ ట్రాక్ కన్ఫామ్ అంటగా? - Bigg Boss 8 Telugu - BIGG BOSS 8 TELUGU

Bigg Boss 8 Telugu Love Track : బిగ్​బాస్​లో ఈసారి కూడా లవ్​ ట్రాక్ నడిచే ఛాన్స్ ఉందా? అంటే.. అవును అనే మాట వినిపిస్తోంది. మరి.. కాబోయే ఆ లవ్ బర్డ్స్ ఎవరు? ఎందుకీ డౌట్ వచ్చింది? అన్నది ఇప్పుడు చూద్దాం.

Bigg Boss 8 Love Track
Bigg Boss 8 Love Track (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 10, 2024, 3:55 PM IST

Bigg Boss 8 Telugu Love Track : బిగ్​బాస్​ అంటే ఓ పక్క గొడవలు.. మరో పక్క లవ్ ట్రాక్ నడవడం మామూలు విషయమే. అయితే.. ఈ సీజన్​లో ఫస్ట్ వీక్​లో అలాంటి సూచన ఏదీ కనిపించలేదు. అయితే.. తాజాగా విడుదల చేసిన ప్రోమో చూస్తే మాత్రం.. ఈ సారి కూడా ప్రేమాయణం కన్ఫామ్​ అంటున్నారు జనాలు. అయితే.. అది ఇద్దరి మధ్యనే ఉంటుందా? లేదా.. ట్రయాంగల్ లవ్ స్టోరీనా అన్నది తేలాల్సి ఉందని అంటున్నారు. మరి.. ఇంతకీ కాబోయే ప్రేమ పక్షులు ఎవరో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఆ ముగ్గురే..

పృథ్వీ, నిఖిల్, సోనియా మధ్య ట్రయాంగిల్ లవ్​ స్టోరీ నడిచే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. వీరు మాట్లాడిన సమయంలో వచ్చిన బ్యాక్​గ్రౌండ్ మ్యూజిక్.. లవ్ ట్రాక్ ఉంటుందనే థాట్​ తీసుకొచ్చింది. "నిజమైన ప్రేమలో ఫ్రీడమ్ ఉండాలి" అని విష్ణుప్రియ అంటోన్న సమయంలో సోనియా.. పృథ్వీ హ్యాండ్​ని పట్టుకుని క్యూట్​గా బిహేవ్ చేస్తుంటుంది. దీనిపై స్పందించిన విష్ణుప్రియ.. "పృథ్వీ ఎంతమందికైనా ప్రేమను పంచొచ్చు"అని మరో పంచ్ వేసింది. దీంతో అక్కడ ఉన్న కంటెస్టెంట్లు అందరూ నవ్వేశారు.

ఆ తర్వాత నిఖిల్ దగ్గర కూర్చున్న సోనియా.. "నువ్వు సిగరెట్ తాగకుండా ఉండరా.. నువ్వు ఏమడిగినా ఇస్తా" అని సోనియా బంపర్ ఆఫర్ ఇచ్చింది. దీంతో నీళ్లు తాగుతున్న నిఖిల్ ఒక్కసారిగా షాక్​కు గురయ్యాడు. ఈ సమయంలోనూ వీరిద్దరి మధ్య ట్రాక్ నడుస్తుందనేలా ప్రోమోలో బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ వినిపించింది. దీనికి సోనియా సిగ్గుపడిపోగా.. నిఖిల్ కూడా నవ్వుతూ మీసాలు మెలేశాడు.

దీనికి సీత.. "దే ఫౌండ్ ఈచ్​ అదర్" అనగానే.. "గాడ్ మస్ట్​ బి క్రేజీ అంటే ఇదే"అని అభయ్ నవీన్ అన్నాడు. "చూసేవన్నీ నిజాలు కాదం"టూ మరో కౌంటర్ కూడా వేశాడు. అయితే.. సోనియా ఇదంతా కావాలనే స్ట్రాటజీతో చేస్తోందా? లేదా అటు నిఖిల్, ఇటు పృథ్వీరాజ్​ని తన వైపు తిప్పుకోవాలని చూస్తోందా? అనే విషయం తేలాలంటే మాత్రం కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

ఇదిలా ఉంటే.. చూస్తుండగానే బిగ్‌బాస్‌ సీజన్‌-8 తొలివారం ముగిసింది. తన మాటలు, ప్రాసలు, పంచ్‌డైలాగ్స్‌తో ప్రేక్షకులకు వినోదాన్ని పంచిన బెజవాడ బేబక్క ఎలిమినేట్‌ అయ్యారు. విష్ణు ప్రియ, బేబక్క, సోనియా, పృథ్వీరాజ్‌, శేఖర్‌ బాషా, నాగ మణికంఠలు ఎలిమినేషన్​కు నామినేట్‌ అవ్వగా చివరకు బేబక్క, మణికంఠ మిగిలారు. ప్రేక్షకుల నుంచి తక్కువ ఓట్లు వచ్చిన బేబక్క ఎలిమినేట్ అయినట్టు హోస్ట్ నాగార్జున ప్రకటించారు.

బిగ్​ బాస్ 8 : నువ్వు ఉండాల్సినోడివేనయ్యా - శేఖర్ బాషా కామెడీ అరాచకం! - సోషల్ మీడియాలో వైరల్ - bigg boss 8 shekar basha

బిగ్ బాస్ 8 : నాగమణికంఠ భార్య ఎవరో తెలిసిపోయిందిగా - పెళ్లి వీడియో వైరల్! - naga manikanta marriage video

ABOUT THE AUTHOR

...view details