Bigg Boss Fourth Week Nominations:బిగ్‌బాస్ హౌజ్‌లో నాలుగో వారం నామినేషన్లు మాంచి వాడీవేడీగా సాగాయి. ప్రతి వారం లాగానే ఈ వారం కూడా ఒక్కొక్క సభ్యుడు ఇద్దర్ని నామినేట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ వారం నామినేట్ చేసే సభ్యుల ముఖం మీద ఫోమ్ (నురగ) కొట్టాలి. నిఖిల్ చీఫ్ అయిన కారణంగా ఎవరూ నామినేట్ చేయడానికి లేదు. ఇక నామినేషన్ ప్రక్రియను ఆదిత్యతో మొదలుపెట్టాడు బిగ్‌బాస్.
ఆదిత్యముందుగా పృథ్వీని నామినేట్ చేశాడు. ప్రభావతి 2.0 టాస్కులో కావాల్సిన దానికన్నా అగ్రెషన్ చూపించాడని.. ఓ విధంగా పిచ్చి పట్టినట్లు ప్రవర్తించాడంటూ ఆదిత్య చెప్పాడు. అలానే తనని అవమానించేలా మాట్లాడాడంటూ ఆదిత్య రీజన్ చెప్పాడు. ఇక దీనికి పృథ్వీ తన వెర్షన్ చెప్పి నామినేట్ చేయించుకున్నాడు.
తర్వాత తన సెకండ్ నామినేషన్ సోనియాకి వేశాడు ఆదిత్య. నాకు హౌస్‌లోకి వచ్చిన ఫస్ట్ 3 డేస్‌లో కనిపించిన సోనియా తర్వాత కనిపించలేదు.. ఎక్కడైనా తప్పు జరిగినప్పుడు మాట్లాడటం.. న్యూట్రల్‌గా ఉండటం అది నాకు కనిపించట్లేదు.. మీరు ఒక క్లాన్‌కి వెళ్లిన తర్వాత మీ వాయిస్‌యే వినిపించట్లేదు.. మీరు కొన్నిచోట్ల మైక్ వదిలేసి కూడా మాట్లాడారు.. మీ వాళ్లతో గుసగుసలాడుతున్నారంటూ ఆదిత్య చెప్పాడు. దీనికి కాసేపు సోనియా అడ్డదిడ్డంగా మాట్లాడింది.
నైనిక తన మొదటి నామినేషన్ మణికంఠకి వేసింది. నువ్వు సెల్ఫిష్, అలానే ఎదుటివాళ్లను డీమోటివేట్ చేస్తావ్. నీకు నీ మీద కాన్ఫిడెన్స్ లేకపోతే వేరే వాళ్ల కాన్ఫిడెన్స్ డౌన్ చేయకు అంటూ నైనిక క్లారిటీ ఇచ్చింది. దీనికి మణికంఠ ఏదో సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. ఇక నైనిక తన తర్వాతి నామినేషన్ ఆదిత్యకి వేసింది.
నబీల్.. ముందుగా సోనియాను నామినేట్ చేస్తూ వరుసగా తన పాయింట్స్ అన్నీ క్లారిటీగా చెప్పాడు నబీల్. ఇంతలో సోనియా ఏదో చెబుతుంటే "నా పాయింట్ అయిపోని.. ఓఓ.. మేడమ్.. నువ్వు హైదరాబాద్ అంతా తిప్పి తీసుకురాకు.. నా పాయింట్ అయిపోని" అంటూ నబీల్ అసలు ఛాన్స్ ఇవ్వలేదు. ఇక్కడ నబీల్ చేసిన యాక్షన్‌కి యష్మీ తెగ నవ్వుకుంది. ఇక దీనికి అడ్డదిడ్డంగా వాదించింది సోనియా. ఇంతలో సోనియా తరఫున నిఖిల్-పృథ్వీ కూడా నబీల్‌తో వాదించారు. దీంతో నిఖిల్ నీదా నామినేషన్.. మరి ఎందుకు మాట్లాడుతున్నావంటూ నబీల్ కొశ్చన్ చేశాడు. అయినా సరే పృథ్వీ-నిఖిల్ వాదించడంతో డైరెక్ట్‌గా బిగ్‌బాస్‌కే నబీల్ కంప్లెయింట్ చేశాడు. బిగ్‌బాస్.. మొన్న ఆమెతో మాట్లాడుతున్నప్పుడు వీళ్లిద్దరూ ఎట్ల అయితే వచ్చిర్రో.. ఇప్పుడు ఈమెను నామినేట్ చేస్తున్నప్పుడు వాళ్లే వస్తున్నారు అంటూ నబీల్ అన్నాడు.
ఇక తన రెండో నామినేషన్ పృథ్వీకి వేశాడు నబీల్. కోపంలో ఎఫ్ వర్డ్స్ యూజ్ చేయడం చాలా రాంగ్.. అంటూ నబీల్ అన్నాడు . దీనికి పృథ్వీ ఏదో చెబుతుంటే మధ్యలో మాట్లాడింది సోనియా. "ఇందేటి బిగ్‌బాస్.. మధ్యలో ఆమె మాట్లాడుతుంది.. సోనియా నువ్వు మాట్లాడకు.. ఇక్కడే తెలుస్తంది గ్రూప్ గేమ్ అని.." అంటూ గట్టిగానే ఇచ్చాడు నబీల్. ఇక సోనియాపై యష్మీ కూడా ఫైర్ అయింది. నీ నామినేషన్‌లో నువ్వు మాట్లాడు సోనియా.. ఇక్కడ కాదు అంటూ యష్మీ అరిచింది.