తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

నాగ మణికంఠకు ఇంటి నుంచి ఫుడ్​! - కానీ ఓ చిన్న ట్విస్ట్​! - Bigg Boss 8 Naga Manikanta

బిగ్​బాస్​ సీజన్​ 8లో ఈరోజు ఎపిసోడ్​కు సంబంధించిన ​ ప్రొమో రిలీజ్​ అయ్యింది. మరి అందులో ఏం చూపించారో ఇప్పుడు చూద్దాం..

Bigg Boss 8 Naga Manikanta
Bigg Boss 8 Naga Manikanta (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 4, 2024, 2:56 PM IST

Bigg Boss 8 Naga Manikanta: బిగ్​బాస్​ సీజన్​ 8 రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే ఈ సీజన్​ స్టార్ట్​ అయ్యి నెల పైనే అయ్యింది. సెప్టెంబర్​ 1 న గ్రాండ్​ లాంచ్​ ఈవెంట్​తో 14 మంది హౌజ్​లోకి ఎంటర్​ అయ్యారు. ఈ ఐదో వారంలో జరిగిన మిడ్​ వీక్​ ఎలిమినేషన్​తో కలిపి మొత్తంగా ఐదు మంది ఎలిమినేట్​ అయ్యారు. బేబక్క, శేఖర్​ బాషా, అభయ్​ నవీన్​, సోనియా ఆకుల, ఆదిత్య ఓం ఎలిమినేట్​ అయ్యారు. ఇప్పుడు 9 మంది ఉన్నారు. వారిలో ఒకరు ఈ శనివారం ఇంటికి వెళ్లనున్నారు. తాజాగా ఈరోజుకు సంబంధించిన ప్రోమో రిలీజ్​ చేశారు బిగ్​బాస్ నిర్వాహకులు​. ఇందులో నాగమణికంఠకు ఇంటి నుంచి ఫుడ్​ వచ్చినట్లు బిగ్​బాస్​ ప్రకటించాడు. కానీ అది తీసుకోవాలంటే చిన్న కండీషన్​ పెట్టాడు. అది ఎంటో ఈ స్టోరీలో చూద్దాం..

ఎలాంటి అంచనాలు లేకుండా హౌజ్​లోకి వచ్చి.. లాంఛింగ్ ఎపిసోడ్‌లోనే తన విషాధ గాధ చెప్పి గుండెల్ని పిండేశాడు నాగ మణికంఠ. వాళ్ల నాన్న చనిపోవడం, అమ్మ రెండో పెళ్లి చేసుకోవడం, కొద్దిరోజులకే క్యాన్సర్​తో అమ్మ చనిపోవడం, ఆ తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల పెళ్లి చేసుకోవడం, కూతురు పుట్టడం.. ఇలా ఒక్కటేమిటి తన జీవితంలో జరిగిన అన్ని విషయాలను లాంచింగ్​ ఎపిసోడ్​లో ఏవీ వేసి మరీ చూపించారు. అంతేనా స్టేజ్​ మీద నాగార్జున క్వశ్చన్​ చేసినప్పుడు.." బిగ్ బాసే నా ఆఖరి ప్రయత్నం. ఈ షో నాకు నా లైఫ్ కంటే ఎక్కువ. నేను కోల్పోయిన రెస్పెక్ట్‌ని మళ్లీ సాధించానికి ఈ షోకి వచ్చాను. ఇదే నా లాస్ట్ ఫైట్" అని చెప్పాడు.

బిగ్ బాస్ 8 : నాగమణికంఠ భార్య ఎవరో తెలిసిపోయిందిగా - పెళ్లి వీడియో వైరల్!

ఇక హౌజ్​లోకి వచ్చిన మొదటి రోజు నుంచే ఎమోషనల్ అవుతూ వస్తున్నాడు నాగ మణికంఠ. గ్రాండ్ లాంచ్ రోజే ఎలిమినేషన్ అంటూ ప్రాంక్ చేయగా బాధ, కోపం రెండూ వెల్లగక్కాడు. తన కష్టాలు చెప్పుకున్నాడు. అయితే, ఆ తర్వాత కూడా చాలా సందర్భాల్లో కష్టాలను వెల్లడించారు. ఈ సీజన్‍లో ఫస్ట్ నామినేషన్ల సందర్భంగా మణికంఠ ఏకంగా కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే, సింపతీ గేమ్ ఆడుతున్నావంటూ అతడిపై కొందరు కంటెస్టెంట్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. నామినేట్ అయిన తర్వాత ఎలిమినేట్ అవుతానేమోననే భయంతో హౌస్‍లో బోరున ఏడ్చిన సందర్భం కూడా ఉంది. ఇక అప్పటి నుంచి కూడా ఏదో ఒక సందర్భంలో మణికంఠ ఎమోషనల్​ అవుతూనే ఉన్నాడు. తాజాగా రిలీజ్​ చేసిన ప్రోమోలో కూడా మణికంఠ ఎమోషనల్​ అవుతూ కనిపించాడు. అందుకు కారణం అతని వైఫ్​ ప్రియ నుంచి ఫుడ్​ రావడమే. ఇంతకీ ప్రోమోలో ఏం జరిగిందో చూస్తే..

ముందుగా హౌజ్​మేట్స్​ అందరినీ ఒక్కొక్కరిగా కన్ఫెషన్​ రూమ్​కు పిలిపించి మాట్లాడాడు బిగ్​బాస్​. ఈ క్రమంలో కొద్దిసేపు నవ్వులు పూశాయి ఇంట్లో. ఆ తర్వాత కంటెస్టెంట్ల ఎదురుగా ఉన్న క్లాత్​ తీయమని చెప్పిన బిగ్​బాస్​.. నిఖిల్​, మణికంఠకు ఇంటి నుంచి ఫుడ్​ వచ్చిందని, దానితో పాటు ఓ మెసేజ్​ కూడా వచ్చినట్లు చెప్పారు​. దీంతో కంటెస్టెంట్లను ఆ ఇద్దరిలో ఫుడ్​ ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారో చెప్పాలన్నాడు. అయితే ప్రోమోలో చూపించిన ప్రకారం యష్మీ.. నిఖిల్​కు ఫుడ్​ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. దీంతో మణికంఠ "ప్లీజ్​ యష్మీ ప్లీజ్"​ అంటూ రిక్వెస్ట్​ చేస్తున్నట్లు చూపించారు. పైగా బిగ్​బాస్​ కూడా మణికంఠ గురించి ఏం ఆలోచించాలనుకోవడం లేదా అంటూ యష్మీతో అన్నా.. "సారీ బిగ్​బాస్​.. నేను నిఖిల్​కే ఇస్తా" అని చెప్పేసింది. దీంతో నాగ మణికంఠ.. "యష్మీ ఐ నీడ్​ దట్​ మెసేజ్​" అంటూ ఎమోషనల్​ అయ్యాడు. అయితే చివరగా యష్మీ.. నిఖిల్​కు సంబంధించిన ఫుడ్​ బౌల్​తో బయటికి రావడం చూపించారు. కానీ సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్న ప్రకారం నాగ మణికంఠకు ఇంటి ఫుడ్​ అందినట్లు సమాచారం. మరి అది తెలియాలంటే నేటి ఎపిసోడ్​ వరకు ఆగాల్సిందే..

బిగ్​బాస్​ 8: కొంత గోల - కొన్ని కన్నీళ్లు - ఫస్ట్​ వీక్​ నామినేట్ అయింది వీళ్లే!

సెకండ్​ వైల్డ్​ కార్డ్​ ఎంట్రీ ఫొటో రిలీజ్​​ - ఎవరో గుర్తుపట్టగలరా?

ABOUT THE AUTHOR

...view details