Ramcharan Buchi babu RC 16 Movie : మెగా హీరో రామ్ చరణ్ దిగ్గజ, దర్శకుడు శంకర్ డైరెక్షన్లో గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తూనే బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. చాలా కాలం నుంచి సెట్స్‌పైకి వెళ్లకుండా ఫ్యాన్స్‌ను ఊరిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్‌ను దాదాపుగా పూర్తి చేసుకుందట. నటీ నటుల ఎంపిక కూడా ఒక కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. ఇక ఈ నెల చివరి వరకు సెట్ వర్క్ పూర్తి అవుతుందని సమచారం.
అయితే ఈ మూవీ షూటింగ్ ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీ చిత్రీకరణ గురించి ఓ వార్త బయటకు వచ్చింది. నవంబర్ 1 నుంచి రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయట. నవంబర్ 1 నుంచి 8 వరకు రామ్‌చరణ్‌తో పాటు కీలక నటీ నటులపై చిత్రీకరణ చేయబోతున్నారని తెలిసింది.
మొదటి షెడ్యూల్ పూర్తైన తర్వాత చిన్న బ్రేక్ తీసుకుని నవంబర్ రెండు లేదా మూడో వారంలో రెండో షెడ్యూల్‌ను ప్రారంభం చేస్తారట. అనంతరం డిసెంబర్లో గేమ్ ఛేంజర్ రిలీజ్ ఉండటం వల్ల రామ్ చరణ్, ఆ మూవీ ప్రమోషన్స్ కోసం కాస్త గ్యాప్ తీసుకుంటారట. ఆ సమయంలో చరణ్ లేని సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలిసింది.
మొత్తానికి నవంబరులో సినిమాను ప్రారంభించి చిన్న చిన్న బ్రేక్‌లు ఇస్తూ జనవరి సంక్రాంతి వరకు షూటింగ్ కంటిన్యూ చేస్తారని టాక్ వినిపిస్తోంది. అనంతరం మళ్లీ గ్యాప్ తీసుకుని వేసవికి ముందు మూడో షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తారని సమాచారం. ఆ షెడ్యూల్లో సినిమాకు సంబంధించిన మెజార్టీ టాకీ పార్ట్ పూర్తి కానుంది.
కాగా, ఈ చిత్రం స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతోంది. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటించనుంది. ఇప్పటికే ఆమె దేవర చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ హిట్ అందుకుంది. సినిమాలో ఆమె తన అందం, లుక్స్‌తో తెలుగు ప్రేక్షకులకు బానే ఆకట్టుకుంది.
'విశ్వంభర' షూటింగ్ లేటెస్ట్ అప్డేట్ - ఎక్కడి దాకా వచ్చిందంటే? - Vishwambara Movie Shooting