ETV Bharat / spiritual

చిన్నశేష వాహనంపై వెంకన్నస్వామి- ఒక్కసారి దర్శిస్తే సమస్త నాగ దోషాలు పరార్​! - Chinna Sesha Vahanam - CHINNA SESHA VAHANAM

Venkateswara Swamy Chinna Sesha Vahanam : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఈ నెల 5న మలయప్పస్వామి చిన్న శేష వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగనున్నారు.

Lord Malayappa Rides Chinna Sesha Vahanam
Lord Malayappa Rides Chinna Sesha Vahanam (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 4, 2024, 6:28 PM IST

Venkateswara Swamy Chinna Sesha Vahanam : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. దేవదేవుని బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ నెల 5వ తేదీన అంటే శనివారం ఉదయం పూట మలయప్ప స్వామి చిన్న శేష వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగనున్నారు. ఈ సందర్భంగా చిన శేష వాహనం విశిష్టతను తెలుసుకుందాం.

చిన్నశేష వాహన ప్రాశస్త్యం
పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్న శేషుడిని వాసుకిగా భావిస్తారు. శ్రీవైష్ణవ సంప్రదాయం అనుసరించి భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని దర్శిస్తే భక్తులకు కుండలినీ యోగ సిద్ధి ఫలం లభిస్తుందని ప్రశస్తి.

ఎవరీ వాసుకి!
మహాభాగవతం ప్రకారం, క్షీర సాగర మధనంలో మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకిని త్రాడుగా చేసుకొని సాగరాన్ని మదించిన సంగతి తెలిసిందే! హిందూ మత విశ్వాసాల ప్రకారం వాసుకి నాగులకు రాజు అని అంటారు.

దర్శన భాగ్యం
చిన శేషవాహనంపై ఊరేగే శ్రీవారిని దర్శిస్తే సమస్త నాగ దోషాలు పోయి వివాహం, సంతానం వంటి శుభ ఫలితాలను పొందవచ్చునని శాస్త్ర వచనం.

ఓం నమో వెంకటేశాయ!

ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.