ETV Bharat / entertainment

'విశ్వంభర' షూటింగ్ లేటెస్ట్ అప్డేట్​ - ఎక్కడి దాకా వచ్చిందంటే? - Vishwambara Movie Shooting - VISHWAMBARA MOVIE SHOOTING

Chiranjeevi vishwambara Movie Shooting Update : చిరంజీవి 'విశ్వంభర' షూటింగ్ లేటెస్ట్ అప్డేట్ వివరాలు తెలిశాయి.

source ETV Bharat
Chiranjeevi vishwambara Movie Shooting Update (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 4, 2024, 3:56 PM IST

Chiranjeevi vishwambara Movie Shooting Update : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'విశ్వంభర'. భోళాశంకర్ వంటి ఫ్లాప్ తర్వాత ఎలాగైనా హిట్ కొట్టాలని చిరు పట్టుదలతో ఉన్నారు. అలాగే తన తొలి చిత్రంతోనే బింబిసారతో భారీ సక్సెస్ అందుకున్న దర్శకుడు మల్లిడి వశిష్ఠ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

సోషియో ఫాంటసీగా అత్యంత భారీ బడ్జెట్​తో యువీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దాదాపు రూ.200 కోట్ల భారీ బ్జడెట్‌తో నిర్మిస్తున్నారు. చిరంజీవి కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమాగా ఇది నిలిచిపోనుంది. అంతేకాదు, సోషియో ఫాంటసీ సినిమా కావడం వల్ల వీఎఫ్‌ఎక్స్‌పై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతి కానుకగా విడుదల చేయడమే లక్ష్యంగా మూవీ టీమ్ షూటింగ్ పనులను చక చక చేసుకుంటూ పోతోంది. రీసెంట్​గా ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ పనులను కూడా ప్రారంభమయ్యాయి.

మొత్తంగా ఈ చిత్రం షూటింగ్​తో పాటు డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇలా అన్నీ ఏకకాలంలోనే చేసుకుంటూ ముందుకు పోతోంది. అయితే ఈ సినిమా షూటింగ్​పై లేటెస్ట్ అప్డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం సినిమాలో రెండు సాంగ్స్​ షూటింగ్ మినహా అంతా పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఇవి కూడా త్వరలోనే పూర్తి చేసి ఈ జనవరి బరిలోనే సినిమాను దింపే సన్నాహాలు మేకర్స్ చేస్తున్నట్లుగా సమాచారం అందింది.

Chiranjeevi vishwambara Heroine : కాగా, ఈ విశ్వంభర సినిమా కోసం ఏకంగా 13 భారీ సెట్‌లతో ఓ ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించారు. ఇంతకుముందెన్నడూ చూడని సరికొత్త అవతారంలో చిరంజీవి కనిపించనున్నారు. సినిమాలో చిరుకు జోడిగా త్రిష, ఆషిక రంగనాథ్​ నటిస్తున్నారు. మరో ముగ్గురు హీరోయిన్లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఎన్నో అంచనాలు రానున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

'శ్వాగ్' రివ్యూ - శ్రీ విష్ణు ఖాతాలో హ్యాట్రిక్ హిట్ పడినట్టేనా? - Sri Vishnu SWAG Movie Review

రజనీకాంత్​ 'వేట్టాయన్'పై కోర్టులో కేసు - ఎందుకంటే? - Vettaiyan Movie Court Case

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.