ETV Bharat / entertainment

ప్రధాని మోదీకి రజనీ కాంత్​ స్పెషల్ థ్యాంక్స్​ - Rajinikanth Thanks To PM Modi - RAJINIKANTH THANKS TO PM MODI

Rajinikanth Thanks To PM Modi : శ్రేయోభిలాషులు, అభిమానులకు, ప్రధాన మంత్రి మోదీకి ధన్యవాదాలు తెలిపిన రజనీ కాంత్​.

source ETV Bharat and ANI
Rajinikanth Thanks To PM Modi (source ETV Bharat and ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 4, 2024, 6:27 PM IST

Rajinikanth Thanks To PM Modi : సూపర్ స్టార్ రజనీ కాంత్‌ ఇటీవలే అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. ఇక చికిత్స అనంతరం కోలుకున్న ఆయన గురువారం రాత్రి ఆయన ఇంటికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో తన ఆరోగ్యంపై ఆరా తీసి ప్రార్థించిన శ్రేయోభిలాషులు, అభిమానులను ఉద్దేశించి రజనీ పోస్ట్‌ పెట్టారు.

ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. "నా హెల్త్​పై ప్రత్యేక శ్రద్ధ చూపించి, ఫోన్‌ చేసి పరామర్శించిన ప్రధాని నరేంద్ర మోదీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు" అని పేర్కొన్నారు.

తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన తమిళనాడు సీఎం స్టాలిన్‌, ఏపీ సీఎం చంద్రబాబు, బాలీవుడ్‌ స్టార్‌ అమితాబ్‌కు కూడా ధన్యవాదాలు తెలిపారు.

Rajinikanth Hospitalized : కాగా, రజనీకాంత్ సెప్టెంబర్‌ 30న చెన్నైలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చేరారు. వైద్యులు ఆయనకు ట్రాన్స్‌కాథెటర్‌ పద్ధతి ద్వారా ట్రీట్​మెంట్​ చేసి స్టెంట్ వేశారు. ఇప్పుడు ఆరోగ్యం నిలకడగా ఉండటం వల్ల ఆయన్ను గురువారం రాత్రి డిశ్చార్జ్‌ చేశారు. కొన్ని వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు.

Rajnikanth vettaiyan : ఇక రజనీ కాంత్ సినిమాల విషయానికి వస్తే రజనీ కాంత్ నటించిన లేటెస్ట్ మూవీ వేట్టయన్‌ సినిమా అక్టోబర్‌ 10న గ్రాండ్​గా రిలీజ్ కానుంది. టి.జె.జ్ఞానవేల్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రంపై ఆడియెన్స్​లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ కీలక పాత్ర పోషించారు. ఇంకా మంజు వారియర్​, ఫహాద్ ఫాజిల్ కూడా ఉన్నారు.

Rajinikanth Coolie Movie : దీంతో పాటు రజనీ కాంత్​ కూలీ అనే సినిమా కూడా చేస్తున్నారు. స్మగ్లింగ్ బ్యాక్​గ్రౌండ్​లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని లోకేశ్‌ కనగరాజ్‌ తెరకెక్కిస్తున్నారు. విశ్రాంతి పూర్తవ్వగానే రజనీ కాంత్‌ కూలి సినిమా చిత్రీకరణలో పాల్గొనే ఛాన్స్ ఉంది. ఇంకా ఈ మూవీలో నాగార్జున, శ్రుతిహాసన్‌, సత్యరాజ్‌, ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్నారు. అనిరుధ్‌ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.

రజనీకాంత్ హెల్త్ అప్డేట్- ఆసుపత్రి నుంచి తలైవా డిశ్చార్జి - Rajinikanth Health Update

'ప్రభాస్ మంచి వ్యక్తి, కానీ సౌత్ ఇండస్ట్రీనే అలాంటిది' - 'రాజాసాబ్​' మాళవిక - Malavika Mohanan On Prabhas

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.