Bakery Style Fried Chicken Sandwich at Home: చికెన్ అంటే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు. చికెన్‌తో ఏ వంటలు చేసినా వద్దు అనకుండా తినేస్తారు. ఇక చికెన్‌తో చేసే రెసిపీలు బోలెడు ఉంటాయి. అందులో ఫ్రైడ్ చికెన్ శాండ్విచ్ కూడా ఒకటి. పైన క్రిస్పీగా.. లోపల జ్యూసీగా చాలా బాగుంటుంది. ఒక్కటి తింటే చాల్లే అన్న దగ్గర నుంచి మళ్లీ మళ్లీ తినాలనిపించే వరకు లాక్కెళ్తుంది దీని రుచి. అయితే చాలా మంది ఈ రెసిపీను ఇంట్లో ట్రై చేస్తుంటారు. కానీ బేకరీలో చేసే రుచి మాత్రం రాదు. అలాంటి సమయాల్లో ఈ విధంగా చేస్తే బేకరీలో కొనే అవసరమే లేకుండా తినాలనిపించిన ప్రతిసారి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటారు. మరి ఇది ఎలా తయారు చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందామా..
కావాల్సిన పదార్థాలు:
చికెన్ ఉడికించడానికి కావాల్సినవి:
- లేత చికెన్ బ్రెస్ట్ - 250 గ్రాములు
- ఉప్పు - కొద్దిగా
- మిరియాలు - అర టీ స్పూన్
- బిర్యానీ ఆకు - 1
శాండ్విచ్ కోసం:
- ఉల్లిపాయ - 1
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
- పచ్చిమిర్చి - 3
- చాట్ మసాలా - అర టీ స్పూన్
- చిల్లీ ఫ్లేక్స్ - అర టేబుల్ స్పూన్
- ఉప్పు - కొద్దిగా
- ఉడికించిన ఆలు - 1
- చీజ్ క్యూబ్స్ - 3
- శాండ్ విచ్ బ్రెడ్ స్లైస్‌లు - తగినన్ని
- మయానైజ్ - తగినంత
- ఎగ్స్ - 4
- బ్రెడ్ క్రంబ్స్ - తగినంత
- మిరియాల పొడి - పావు టీ స్పూన్
- పచ్చి పాలు- పావు కప్పు
- చిల్లీ ఫ్లేక్స్ - అర టేబుల్ స్పూన్
- ఉప్పు - కొద్దిగా
- మిరియాల పొడి - పావు టీ స్పూన్
- నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ విధానం:
- ముందుగా స్టవ్ ఆన్ చేసి ఓ పాన్ పెట్టి అందులో నీరు పోసుకోవాలి. ఆ తర్వాత అందులోకి చికెన్, ఉప్పు, మిరియాలు, బిర్యానీ ఆకు వేసి హై ఫ్లేమ్ మీద మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు చికెన్ ముక్కలు చల్లారిన తర్వాత ఓ ప్లేట్లోకి తీసుకుని సన్నగా విడదీసుకోవాలి.
- ఇప్పుడు అందులోకి ఉల్లిపాయ తరుగు, కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి, చాట్ మసాలా, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, మిరియాల పొడి, ఉడికించిన బంగాళదుంప తరుగు వేసి బాగా కలుపుకోవాలి.
- ఆ తర్వాత అందులోకి రెండు చీజ్ క్యూబ్స్‌ను తురిమి వేసుకుని మరోసారి కలిపి పక్కకు పెట్టుకోవాలి.
- ఇప్పుడు రెండు స్లైస్‌ల శాండ్విచ్ బ్రెడ్ తీసుకుని.. ఆ రెండింటిపై మయోనైజ్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు అందులో ఒక స్లైస్ మీద ప్రిపేర్ చేసుకున్న చికెన్ మిశ్రమం పెట్టి మొత్తం సమానంగా వచ్చేలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ పై చీజ్‌ను తురుముకోవాలి.
- ఆ తర్వాత మయోనైజ్ రాసిన మరో బ్రెడ్ స్లైస్ తీసుకుని కవర్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ బ్రెడ్ స్లైస్‌లు నాలుగు చివర్లు కట్ చేసుకోవాలి. ఇలా అన్నింటిని ప్రిపేర్ చేసుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి.
- ఈలోపు మరో గిన్నెలో కోడిగుడ్లు పగలగొట్టి వేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి మిరియాల పొడి, పచ్చిపాలు, చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా బీట్ చేసుకోవాలి.
- ఇప్పుడు ముందే ప్రిపేర్ చేసుకున్న శాండ్విచ్ను ఎగ్ మిశ్రమంలో పూర్తిగా మునిగేలా డిప్ చేసి.. దానిని బ్రెడ్ కంప్స్లో డిప్ చేసుకోవాలి. శాండ్‌విచ్‌కు బ్రెడ్ క్రంబ్స్ బాగా పట్టేలా చూడాలి. ఇలా అన్నింటిని చేసుకోవాలి.
- ఇప్పుడు మరుగుతున్న నూనెలో ఒక శ్వాండిచ్ వేసుకుని అలానే ఉంచాలి. ఓ రెండు నిమిషాల తర్వాత గరిటెతో నూనెను బ్రెడ్ మీదకు అనుకుంటూ ఉండాలి. అలా బ్రెడ్ కొద్దిగా వేగిన తర్వాత రెండో వైపుకు తిప్పుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ వచ్చిన తర్వాత తీసుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే ఫ్రైడ్ చికెన్ శాండ్విచ్ రెడీ.
- దీన్ని వేడి వేడిగా టమాట సాస్‌తో తింటే సూపర్‌గా ఉంటుంది. మరి నచ్చిందా? అయితే ఓ సారి మీరు కూడా ట్రై చేయండి..
ఇవీ చదవండి:
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే మంచూరియా - ఇలా ఈజీగా ప్రిపేర్ చేసేయండి!
యమ్మీ యమ్మీగా "ఫ్రైడ్ ఎగ్ సలాడ్" - చిటికెలో ప్రిపేర్ చేసుకోండిలా! - టేస్ట్ వేరే లెవల్ అంతే!