Bigg Boss 8 Gowtham Krishna Emotional:బిగ్బాస్ 8వ సీజన్‍లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎనిమిది మంది కంటెస్టెంట్లు హౌజ్‌లోకి వచ్చిన విషయం తెలిసిందే. వైల్డ్ కార్డ్స్ ఎంట్రీతో ఆట కాస్త ఇంట్రెస్టింగ్‍గా మారింది. ఈ క్రమంలోనే హౌజ్‌మేట్స్‌కు ఓ టాస్క్ ఇవ్వగా.. గత సీజన్‍లో జరిగిన ఓ విషయాన్ని అవినాశ్ గుర్తు చేయడంతో గౌతమ్ ఫీలయ్యారు. ఏకంగా కన్నీరు పెట్టుకున్నారు. ఏంటి ఆ విషయం? అక్టోబర్ 9వ నాటి ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..
టాస్క్ ఇదే:అమ్మాయిలు, అబ్బాయిలను టీమ్‍లుగా విభజించి గేమ్ ఆడించారు బిగ్‍బాస్. అబ్బాయిలకు లీడర్‌గా రోహిణి, అమ్మాయిలకు హెడ్‍గా అవినాశ్ ఉండాలని చెప్పారు. దీంతో బిగ్‍బాస్ కన్‍ఫ్యూజ్ అయినట్టున్నారని, తాను అమ్మాయిని, అవినాశ్ అబ్బాయి అని రోహిణి చెప్పారు. దీంతో తాను సరిగానే చెప్పానని బిగ్‍బాస్ అన్నారు. ఈ క్రమంలోనే నవ్వకుండా ఉండేందుకు ప్రయత్నించు అనే గేమ్ జరిగింది. నోటితో నీరు నింపుకున్న కంటెస్టెంట్‍ను నవ్విస్తే వారు ఔట్ అని బిగ్‍బాస్ చెప్పారు.
బిగ్‌బాస్ చెప్పిన దాని ప్రకారం ముందుగా అమ్మాయిలంతా నోట్లో నీళ్లు నింపుకొని రెడీ అయిపోయారు. ఇక అబ్బాయిల టీమ్ లీడర్ అయిన రోహిణి నవ్వించడానికి ప్రయత్నించింది. "యష్మీ ఆ మూతి ఎంత బావుందో తెలుసా.. ఆ మచ్చ మడతల్లోకెల్లి.." అంటూ ఏదేదో ట్రై చేసింది కానీ యష్మీ నవ్వలేదు. ఇక గంగవ్వను నవ్వించడానికి కూడా తెగ ట్రై చేసినప్పటికీ పనవ్వలేదు. అందరూ సీరియస్‌గా ఉన్నారు.. వీళ్లకి హాస్య గ్రంథులు కాదు ఏ గ్రంథులూ లేవు" అంటూ రోహిణి డైలాగ్ కొట్టింది. ఇంతలో బజర్ మోగింది. ఇక తర్వాత అబ్బాయిలంతా రెడీ అవ్వగా అమ్మాయిల టీమ్ లీడర్ అవినాష్ నవ్వించడానికి వచ్చాడు. ముందుగా మణికంఠ దగ్గరికెళ్లి.. "అఖిల బ్రహ్మాండకోటి.." అంటూ తననే ఇమిటేట్ చేశాడు. కాసేపు నవ్వు ఆపుకున్నా తర్వాత తట్టుకోలేక నవ్వేసి ఔట్ అయిపోయాడు మణి.
నామినేషన్స్ వార్: ఓజీ క్లాన్ Vs రాయల్ క్లాన్ - మొత్తంగా ఈ వారం నామినేట్ అయ్యింది వీరే!
గౌతమ్ ఏడ్వడానికి కారణం:ఆ తర్వాత అశ్వత్థామ 2.0 వచ్చాడు.. అంటూ గౌతమ్ దగ్గరికెళ్లి నవ్వించడానికి ట్రై చేశాడు అవినాష్. ఇంతలో స్టేజ్ దిగిపోయి.. "సరేసరే బ్రో ఒన్ సెకండ్.." అంటూ అరిచాడు గౌతమ్. అసలు ఎవరికీ ఏం అర్థం కాలేదు. "అశ్వత్థామ అన్నది సీజన్ 7లో అయిపోయింది అది మళ్లీ మళ్లీ తీసి నాకు ఇరిటేషన్ తెప్పించకు బ్రో" అంటూ గౌతమ్ సీరియస్‌గా అన్నాడు. దీనికి ఏదో కామెడీ చేస్తే ఏంటి బ్రో అంటూ అవినాష్ అన్నాడు. "అది కామెడీ కాదు బ్రో.. నన్ను వెళ్లిపోమంటే వెళ్లిపోతా.. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది బ్రో" అంటూ మైక్ కింద పడేసి గౌతమ్ లోపలికి వెళ్లిపోయాడు. ఇక దీనికి హర్ట్ అయిన అవినాష్.. నేను స్టార్టింగ్‌లోనే ఎవరూ హర్ట్ అవ్వొద్దని చెప్పా.. నేను ఈ టాస్కు ఆడను బిగ్‌బాస్ అంటూ అవినాష్ కూడా సీరియస్ అయ్యాడు.