Bhumika Chawla Gunashekar Movie :భూమిక చావ్లా తెలుగు సినీ ప్రియులకు సుపరిచితురాలే. యువకుడు చిత్రంతో తెలుగు యువకుల గుండెల్ని కొల్లగొట్టిందీ తార. ఈ ముద్దుగుమ్మ తెరపై కనిపిస్తే చాలు సినీప్రేక్షకులు ఉక్కిరిబిక్కిరైపోయేవారు. అంతలా ప్రేక్షకుల మనస్సుల్లో బలమైన స్థానం సంపాదించుకున్న ఈ అందాల మిస్సమ్మ. ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ చిత్రాల్లోనూ నటించిన సంగతి తెలిసిందే. అయితే భూమిక మళ్లీ చాలం కాలం తర్వాత తెలుగులో సందడి చేయబోతున్నట్లు తెలిసింది.
ఇంతకీ ఏ సినిమా అంటే? - 2003లో విడుదలై సూపర్ హిట్ అందుకున్న చిత్రం ఒక్కడు. దర్శకుడు గుణశేఖర్ దీనిని తెరకెక్కించారు. ఈ చిత్రంలో మహేశ్ బాబు సరసన భూమిక నటించి ఆకట్టుకున్నారు. అయితే ఇప్పుడు మళ్లీ 20 ఏళ్ల తర్వాత గుణశేఖర్ దర్శకత్వంలో భూమిక మరోసారి నటించనున్నట్లు ప్రచారం సాగుతోంది.
గుణ టీమ్‌వర్క్స్‌పై గుణశేఖర్ తెరకెక్కిస్తున్న యుఫోరియా అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలోనే భూమిక కీలక పాత్ర పోషించబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె యుఫోరియా పోస్టర్‌ను షేర్ చేయడం వల్ల ఆ వార్తలకు బలం చేకూరినట్టైంది. ఇక ఈ పోస్ట్ చూసిన సినీ ప్రియులు ఈ యుఫోరియా సినిమా గురించి వివరాలు చెప్పాలంటూ రిక్వెస్ట్‌లు పెడుతున్నారు.
కాగా, భూమిక చివరి సారిగా తెలుగులో అనుపమ పరమేశ్వరన్ మెయిన్ రోల్ చేసిన బటర్‌ఫ్లై చిత్రంలో కనిపించింది. హిందీలో కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమాలో నటించింది. ప్రస్తుతం బ్రదర్ అనే సినిమాలో నటిస్తోంది.