Ram Pothineni Bhagyasree Borse : 'మిస్టర్ బచ్చన్' చిత్రంతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ భాగ్య శ్రీ బోర్సే. ఈ అమ్మడికి మొదటి సినిమానే ఫ్లాప్ ఇచ్చినా, తన అందంతో నటన పరంగా మార్కులు కొట్టేసింది. యువత మనసును దోచేసింది. అలా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మరిన్ని సినీ ఛాన్స్‌లను అందుకుంటూ ముందుకెళ్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో లక్కీ ఛాన్స్ పట్టేసింది.
ఇప్పటికే తన రెండో సినిమాగా, దుల్కర్ సల్మాన్, రానా నటిస్తున్న మల్టీస్టారర్ 'కాంత' చిత్రంలో హీరోయిన్‌గా నటించే అవకాశాన్ని చేజిక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ బోర్సే, ఇప్పుడు మరో సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది.
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న మూవీకి ఎంపికైంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా వెల్లడించింది. రీసెంట్ సెన్సేషన్ భాగ్య శ్రీ తమ ప్రాజెక్ట్‌లో భాగం అవ్వడం వల్ల ఈ చిత్రానికి మరింత అందం వచ్చింది అని సదరు సంస్థ పేర్కొంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను రేపు (నవంబర్ 21) వెల్లడించనున్నారు. రేపు పూజా కార్యక్రమంతో షూటింగ్ ప్రారంభించనున్నారు. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి డైరెక్టర్ మహేశ్ దర్శకత్వంలో ఇది తెరకెక్కనుంది. RAPO22 పేరుతో ఇది ప్రచారంలో ఉంది.