Best Animated Movies:యాక్టర్ల రొటీన్ పెర్ఫార్మెన్స్తో బోర్ కొట్టిందా? పిల్లల కోసం ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నారా? ప్రస్తుతం ఫిల్మీ దునియాలో యానిమేషన్ సినిమాలదే హవా నడుస్తోంది. ఈ సినిమాలకు పిల్లలే మెజారిటీ వ్యూవర్స్. కానీ, ఏ సినిమా బాగుంటుందో? దేన్ని సెలెక్ట్ చేసుకోవాలో అయోమయంలో ఉన్నారా? అయితే ఈ లిస్ట్ మీ కోసమే. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ప్రస్తుతం స్ట్రీమింగ్కు అందుబాటులో ఉన్న బెస్ట్ యానిమేటెడ్ మూవీస్ ఇవే! వీటిపై మీరూ ఓ లుక్కేసి నచ్చింది చూసేయండి మరి!
- ఇన్‌సైడ్ అవుట్ (Inside Out 2015):ఈ సినిమా ఆసాంతం ఒక చిన్న పాప చికాకు, సంతోషం, విచారం లాంటి ఎమోషన్స్ చుట్టూ నడుస్తుంది. పిల్లలతో కలిసి చూడదగ్గ స్వీట్ సినిమా. (ఓటీటీ: డిస్నీ + హాట్‌స్టార్)
- ద బాస్ బేబీ (The Boss Baby 2017):ఇది చాలా ప్రత్యేకమైన సినిమా. ఇందులో పిల్లలను రెండు కేటగిరీలుగా చూపిస్తారు. ఫ్యామిలీతో కలిసి ఉండేవారు, ఫ్యామిలీకి దూరంగా ఉండేవారు. ప్రత్యేకమైన వాయీస్ తో డబ్బింగ్ వినిపిస్తుంటే చూసేవారికి చాలా సిల్లీగా, ఫన్నీగా అనిపించడం ఖాయం. (ఓటీటీ: అమెజాన్ ప్రైమ్)
- డెస్పికెబుల్ మీ (Despicable Me 2010):ఈ సినిమా తొలిసారి 2010లో రిలీజ్ అయింది. అది హిట్ కావడంతో ఆ తర్వాత వరుసగా పార్ట్స్ వచ్చాయి. ఒక వ్యక్తి చంద్రుడ్ని దొంగిలించాలని ప్లాన్ చేస్తాడు. కుటుంబ బాధ్యతలు అతణ్ని ఎటువైపు నడిపించాయనేది కథాంశం. (ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్)
- అప్ (Up 2009):పిక్సార్ ప్రొడక్షన్ లో వచ్చిన మరో అద్భుతమైన సినిమా అప్. బెలూన్స్ అమ్ముకునే వ్యక్తి కథ ఇది. తనకొక కంపెనీ ఉందనే విషయం తెలియక ఎన్నో దేశాలు తిరుగుతూ బెలూన్స్ అమ్ముకుంటూ ఉంటాడు. (ఓటీటీ: డిస్నీ + హాట్‌స్టార్)
- ద లయన్ కింగ్ (The Lion King 1994):మరో యానిమేషన్ మాస్టర్ పీస్ ద లయన్ కింగ్. మనస్సును కదిలించే సన్నివేశాలతో తండ్రీకొడుకుల సెంటిమెంట్ తో నడిచే కథ. గత్యంతరం లేని సమయంలో తండ్రి వదిలేయడం వల్ల తాను జీవన పోరాటం సాగించి, తన తండ్రి ప్రత్యర్థిపై ఎలా పగ తీర్చుకుంటాడనేది కథాంశం. (ఓటీటీ: డిస్నీ + హాట్‌స్టార్)
- ద సీక్రెట్ లైఫ్ ఆఫ్ పెట్స్ (The Secret Life of Pets 2016):ఓ పెంపుడు జంతువుతో యజమాని స్నేహం గురించి కథ నడుస్తుంది. తనని కాకుండా ఇంకొక జంతువును ఇంటికి తీసుకొచ్చిన యజమాని మ్యాక్స్ ను బయటకు పంపేస్తాడు. అప్పుడు మ్యాక్స్ ఏం చేసింది. కథ ఎలా సుఖాంతం అయిందనేది కచ్చితంగా చూడాల్సిందే. (ఓటీటీ: అమెజాన్ ప్రైమ్)
- కోకో (Coco 2017):ఫేవరేట్ సింగర్ మాదిరిగా తాను కూడా సింగర్ కావాలనుకుంటుంది ఒక చిన్నారి. అయితే తన కుటుంబంలో సంగీతం గురించి చాలా కఠిన నిబంధనలు ఉండటంతో.. ఆ ఫ్యామిలీని కన్విన్స్ చేసి ఎలా సింగర్ అయ్యాడనేది కథ. (ఓటీటీ: డిస్నీ + హాట్‌స్టార్)
- మోనా (Moana 2016):విలన్ కుతంత్రాలకు బలైపోయి ఒక ఐలాండ్ లో చిక్కుకుపోతుంది చిన్నారి. అక్కడ ఆమె ఎదుర్కొన్న విపత్కర పరిస్థితులు, వాటి నుంచి బయటపడిన తీరు కచ్చితంగా పిల్లలను స్క్రీన్ కు కట్టిపారేస్తుంది. (ఓటీటీ: డిస్నీ + హాట్‌స్టార్)
- మినియన్స్ (Minions 2015): ఒక ఫ్రాంచైజీ నుంచి తప్పుకుని మినియన్స్ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాయనేది సినిమా ఆసాంతం నడుస్తుంది. తన చెడ్డ బాస్ కు సేవ చేయాలనే ప్రయత్నంలో అవి ఎలాంటి పనులు చేశాయనేది కథ. (ఓటీటీ: అమెజాన్ ప్రైమ్)
- సిండ్రెల్లా (Cindrella):రాకుమారుడితో ప్రేమలో పడిన యువతి తన సవతి తల్లితో ఎటువంటి సమస్యలు ఎదుర్కొంది. ఫ్రెండ్స్ అయిన చిన్నచిన్న ఎలుకలు ఎలా సహాయపడ్డాయి అనేది ఆసక్తికరంగా కొనసాగుతుంది. (ఓటీటీ: డిస్నీ + హాట్‌స్టార్)