తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

చరిత్ర సృష్టించాలన్నా తిరగరాయాలన్నా నేనే- ఇక చూపిస్తా నా సెకండ్ ఇన్నింగ్స్: బాలయ్య - DAAKU MAHARAJ BALAKRISHNA

'డాకు మహారాజ్' ట్రైలర్ రిలీజ్ ఈవెంట్- బాలయ్య హాట్ కామెంట్స్

DAAKU MAHARAJ
DAAKU MAHARAJ (Source : ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jan 10, 2025, 9:41 PM IST

Daaku Maharaj Balakrishna :నందమూరి బాలకృష్ణ- బాబీ కాంబోలో తెరకెక్కిన సినిమా 'డాకు మహారాజ్'. ఈ సినిమా జనవరి 12న గ్రాండ్​గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్​ హైదరాబాద్​లో శుక్రవారం ఓ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్​లో సినిమా నుంచి సెకండ్ ట్రైలర్​ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి హీరో బాలకృష్ణ, ఆయన రెండో కుమార్తె దంపతులు, మూవీటీమ్ హాజరయ్యారు.

కాగా, ఈవెంట్​లో బాలయ్య సినిమా గురించి మాట్లాడారు. సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 'నేను ఎప్పుడూ నాపైన రీసెర్చ్ చేసుకుంటా. అభిమానులు ఏం కోరుకుంటున్నారో అదే చేయడానికి ప్రయత్నిస్తా. అఖండ, వీరసింహా రెడ్డి, భగవంత్ కేసరి సినిమాల్లోనూ అదే చేశా. ఇక ఈ సినిమా నుంచి ముందు టీజర్ రిలీజ్ చేశం. చప్పుగా ఉందని అనుకున్నారు. తర్వాత ట్రైలర్ వదిలాం. పర్లేదు అన్నారు. ఇరోజు విడుదల చేసింది అసలైన ట్రైలర్. ప్రేక్షకులు బాలయ్య నుంచి ఏది కోరుకుంటారో అదే చూపించాం'

'మీరు వరుసగా మూడు హిట్లు ఇచ్చారు. ఇంతకుముందు కూడా ఎన్నో ఇచ్చారు. ఇది చూస్తే, నాకు 1986 సంవత్సరం గుర్తొస్తుంది. అప్పుడు 7 సినిమాలు వరుస హిట్లు ఇచ్చారు. చరిత్ర సృష్టించాలన్నా, దాన్ని తిరగరాయాలన్నా నేనే. ఇప్పుడు అఖండ 2 ప్రారంభించాం. ఇక ఇప్పట్నుంచి చూపిస్తా నా రెండో ఇన్నింగ్స్. స్టార్​డమ్ తగ్గినప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ అంటుంటారు. కానీ, నా విషయంలో అది కాదు. అఖండ తర్వాత నా ప్రస్థానం ఎంటో చూపిస్తా' అని బాలయ్య పేర్కొన్నారు. అలాగే ఈ సినిమాలో నటించిన ఊర్వశీ రౌతెలా గురించి కూడా మాట్లాడారు. 'ఊర్వశీ రౌతెలా పాటతోపాటు ఆమెది మంచి పాత్ర. నాతో డ్యాన్స్​ చేసింది, ఫైట్స్ చేసింది, అద్భుతంగా నటించింది' అని అన్నారు.

ఇక సినిమా విషయానికొస్తే, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్లగా​ నటిస్తున్నారు. ఊర్వశీ రౌతెలా స్పెషల్ సాంగ్​లో బాలయ్యతో కలిసి ఆడిపాడింది. బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ దేఓల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. తమన్ సంగీతం అందించారు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్​పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 12న రిలీజ్ కానుంది.

'డాకు మహారాజ్'కు శత్రువులు తక్కువ, ఫ్యాన్స్ ఎక్కువ- సెకండ్ ట్రైలర్ రిలీజ్!

'50 ఏళ్లుగా ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్నా - నన్ను నేను సాన పెట్టుకున్నా' : డాలస్ ఈవెంట్​లో బాలయ్య

ABOUT THE AUTHOR

...view details