తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'ఆదివారం అలా చేస్తే నాకు డేంజర్'- బాలయ్య ​'సండే' సెంటిమెంట్ - BALAKRISHNA DAAKU MAHARAJ

'డాకు మహారాజ్' సక్సెస్ సెలబ్రేషన్స్​- బాలయ్య 'సండే' సెంటిమెంట్​ మీకు తెలుసా?

Balakrishna Daaku Maharaj
Balakrishna Daaku Maharaj (Source : ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jan 19, 2025, 7:00 PM IST

Balakrishna Daaku Maharaj : నందమూరి బాలకృష్ణ 'డాకు మహారాజ్' సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కించిన ఈ సినిమా జనవరి 12 విడుదలై మంచి విజయం అందుకుంది. దీంతో సక్సెస్ సంబరాల్లో భాగంగా మూవీటీమ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ప్రముఖ యాంకర్ సుమతో జరిగిన ఈ ఇంటర్వ్యూ ఆద్యంతం సరదాగా సాగింది. అయితే ఇందులో బాలయ్య, ఆయనకు ఉన్న 'సండే' (Sunday) ఓ సెంటిమెంట్ గురించి చెప్పారు.

ఆయన ఆదివారం అస్సలు నలుపు రంగు దుస్తులు అస్సలు వేసుకోరట. అలా వేసుకుంటే ఆయనకు ప్రమాదం అని తెలిపారు. 'నేను మూలా నక్షత్రం కాబట్టి, మాకు ఆది దేవతలు, ప్రత్యాది దేవతలు ఉంటారు. అందుకే ఆదివారం నలుపు ధరించను. అది నాకు చాలా ప్రమాదకరం. అయినా ఆదిత్య 369 సినిమా సమయంలో సెట్స్​కు బ్లాక్ షర్ట్ వేసుకొని వెళ్లాను. రాక రాక అదే రోజు బాలసుబ్రమణ్యం కూడా సెట్స్​కు వచ్చారు. ఈ రోజు సెట్స్​లో ఆయన కళ్ల ముందే నేను కింద పడ్డా. ఈ ఘటనలో నా నడుము విరిగింది. అయితే ఆయన రావడం వల్లే ఇలా జరిగిందనుకొని ఆ తర్వాత బాలసుబ్రమణ్యం మళ్లీ షూటింగ్ స్పాట్​కు రాలేదు' అని బాలయ్య చెప్పారు. ఇక షూటింగ్ సమయాల్లో ప్రొడక్షన్ ఫుడ్ మాత్రమే తీసుకుంటానని బాలయ్య అన్నారు. ఇంటి పక్కనే షూటింగ్ స్పాట్​ ఉన్నా ప్రొడక్షన్​ నుంచి వచ్చిన భోజనాన్నే తీసుకుంటారట.

కాగా, ఈ సినిమా ఇప్పటికే రూ.124 క్లోట్లు వసూల్ చేసింది. లాంగ్ రన్​లో​ సినిమా రూ.200 కోట్ల క్లబ్​లో చేరుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్, ఊర్వశీ రౌతేలా కీలక పాత్రల్లో నటించారు. బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ దేఓల్ కీలక పాత్రలో కనిపించారు. ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్​పై నిర్మాత నాగవంశీ ఈ సినిమా నిర్మించారు.

'నందమూరి కాదు, ఇకపై NBK తమన్'- బాలయ్య

బాలయ్య కెరీర్​లోనే హైయ్యెస్ట్ ఓపెనింగ్స్- 'డాకు' ఫస్ట్​ డే కలెక్షన్స్ ఎంతంటే?

ABOUT THE AUTHOR

...view details