తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

బాలయ్య బాబుకే నో చెప్పిన హీరోయిన్​! - ఆమెకు అంత డేర్ ఉందా? - jasmine birthday special

ప్రస్తుతం వరుస హిట్లతో కెరీర్​లో పీక్​ స్టేజ్​లో ఉన్న బాలయ్యకు ఓ హీరోయిన్ నో చెప్పిందట. ఈ విషయం ఇప్పుడు బయట చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఆమె ఎవరంటే?

బాలయ్య బాబుకే నో చెప్పిన హీరోయిన్​! - ఆమెకు అంత డేర్ ఉందా?
బాలయ్య బాబుకే నో చెప్పిన హీరోయిన్​! - ఆమెకు అంత డేర్ ఉందా?

By ETV Bharat Telugu Team

Published : Feb 15, 2024, 2:46 PM IST

Balakrishna Meera Jasmine: నందమూరి నటసింహం బాలకృష్ణ ఆరు పదుల వయసులోనూ కుర్ర హీరోలకు దీటుగా సినిమాలు చేస్తూ హ్యాట్రిక్ హిట్స్​తో దూసుకెళ్తున్నారు. అఖండ, వీరసింహా రెడ్డి, భగవంత్ కేసరి వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్​ను అందుకుని కెరీర్​లో పీక్ స్టేజ్​లో ఉన్నారు. అయితే పుల్​ ఫామ్​లో ఉన్న బాలయ్య బాబు చిత్రంలో నటించేందుకు ఓ​ హీరోయిన్ నో చెప్పిందట. ప్రస్తుతం ఈ విషయం గురించి బయట వార్తలు కనిపిస్తున్నాయి. దీంతో బాలయ్యకే నో చెప్పిన ఆ భామ ఎవరబ్బా అంటూ తెలుసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు పలువురు అభిమానులు.

వివరాల్లోకి వెళితే. ఒకప్పుడు టాలీవుడ్​లో స్టార్ హీరోలతో సినిమాలు చేసి హోమ్లీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న భామ మీరా జాస్మిన్. అందం, అమాయకత్వంతో నటిస్తూ తెలుగు సినీ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. రవితేజ, పవన్ కళ్యాణ్, రాజశేఖర్ వంటి స్టార్ హీరోలతో కలిసి భద్ర, మహరధి, గోరింటాకు, గుడుంబా శంకర్ వంటి చిత్రాల్లోనూ నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఇతర భాషా చిత్రాల్లోనూ టాప్ హీరోయిన్​గానే స్టేటస్​ అందుకుంది.

ఆ తర్వాత కెరీర్​ పీక్ స్టేజ్​లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. ఇప్పుడు రీఎంట్రీ కోసం సోషల్ మీడియాలో అందాలను ఆరబోస్తూ అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. అయితే ఈ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్న సమయంలో మీరా జాస్మిన్​కు వెంకటేశ్​తో కలిసి నారప్పలో నటించే అవకాశం వచ్చిందట. కానీ ఆ ఆఫర్​కు నో చెప్పిందట. అనంతరం బాలయ్య వీర సింహా రెడ్డికి కూడా నో చెప్పిందట. ఈ రెండు సూపర్ హిట్లు సినిమాలే కావడం విశేషం. మరి ఆమె రిజెక్ట్​ చేసినట్లు వచ్చిన ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలీదు కానీ ప్రస్తుతానికి ఈ విషయం చక్కర్లు కొడుతోంది. కాగా, అంతకుముందు బాలయ్యతో కలిసి ఆమె మహారథి సినిమా చేసింది.

ఇకపోతే ఇటీవలే మీరా జాస్మిన్​ విమానం చిత్రంలో కీలక పాత్ర పోషించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో పాటే నయనతార, మాధవన్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న టెస్ట్ చిత్రంలోనూ నటిస్తోంది. నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా తన ఫస్ట్ లుక్​ పోస్టర్​ను కూడా విడుదల చేశారు మేకర్స్​.

షాకింగ్ : బాయ్​ఫ్రెండ్ తల పగలగొట్టిన పాయల్ రాజ్​పుత్​!

తారక్ లైనప్​ - ఫుల్ కన్ఫ్యూజన్​ బాస్

ABOUT THE AUTHOR

...view details