తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

OTTలోకి 'డాకు మహారాజ్' ఎంట్రీ- అవన్నీ పుకార్లే! - DAAKU MAHARAJ OTT

ఓటీటీలోకి డాకు మహారాజ్- ఆ రూమర్స్​లో నిజం లేదు!

Daaku Maharaj OTT
Daaku Maharaj OTT (Source : ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Feb 21, 2025, 11:02 AM IST

Daaku Maharaj OTT :నందమూరి బాలకృష్ణ- డైరెక్టర్ బాబీ కాంబోలో తెరకెక్కిన 'డాకు మహారాజ్' సంక్రాంతికి రిలీజై భారీ విజయం దక్కించుకుంది. జనవరి 12న విడుదలైన ఈ సినిమా వరల్డ్​వైడ్​గా రూ.160+ కోట్ల వసూల్ చేసింది. ఇన్ని రోజులు థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం, తాజాగా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్ నెట్​ఫ్లిక్స్​లో శుక్రవారం అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

అవన్నీ రూమర్సే!
అయితే ఓటీటీ రిలీజ్​కు ముందు ఈ సినిమాపై పలు రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. థియేటర్లలో పలు భాషల్లో రిలీజైన ఈ సినిమా, ఓటీటీలో మాత్రం తెలుగులోనే రానుందని వార్తలు వచ్చాయి. అలాగే సినిమాలో కీలక పాత్రలో నటించిన బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలాకు సంబంధించి పలు సీన్స్​ కట్ చేసి ఓటీటీలో రిలీజ్ చేయనున్నారని పుకార్లు వచ్చాయి. అయితే ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది.

తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ 'డాకు మహారాజ్' స్ట్రీమింగ్​ అవుతోంది. అంతేకాకుండా నటి ఊర్వశి రౌతేలాకు సంబంధించి ఎలాంటి సీన్స్​ కూడా తొలగించలేదు. ఆమె నటించిన అన్ని సన్నివేశాలు ఓటీటీ వెర్షన్​లో ఉన్నాయి. దీంతో ఈ పుకార్లకు తెర పడినట్లైంది.

కాగా, ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్​గా నటించగా, శ్రద్ధ శ్రీనాథ్, ఊర్వశీ రౌతేలా కీలక పాత్రలు పోషించారు. బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ దేఓల్ విలన్ పాత్రలో అదరగొట్టారు. రవికిషన్, దివి, చాందిని చౌద‌రి, మ‌క‌రంద్ దేశ్‌పాండే, స‌చిన్‌ ఖేడ్క‌ర్‌ తదితరులు ఆయా పాత్రల్లో కనిపించారు. మ్యూజిక్ సంచలనం తమన్ సంగీతం అందించగా, సితారా ఎంటర్టైన్​మెంట్ బ్యానర్​పై నాగవంశీ నిర్మించారు.

అఖండ 2
ప్రస్తుతం బాలయ్య అఖండ 2 షూటింగ్​లో బిజీగా ఉన్నారు. బోయపాటి శ్రీను- బాలయ్య కాంబోలో తెరకెక్కుతున్న నాలుగో సినిమా ఇది. ఇటీవల ప్రయాగ్​రాజ్ మహాకుంభ్​ మేళాలో ఓ షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తైంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం దసరా సందర్భంగా 2025 సెప్టెంబరు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

'అఖండ 2' క్రేజీ బజ్- బాలయ్యకు విలన్​గా సరైనోడిని దించిన బోయపాటి!

శరవేగంగా 'అఖండ 2' షూటింగ్​ - సెట్స్​లోకి మరో పవర్​ఫుల్ స్టార్!

ABOUT THE AUTHOR

...view details