Balakrishna Boyapati srinu BB4 Akhanda 2 :ఇండస్ట్రీలో కొన్ని కాంబోలకు ప్రత్యేక అభిమానులుంటారు. అలాంటి వాటిలో ఒకటి బాలకృష్ణ - బోయపాటిల కలియిక ఒకటి. వీరిద్దరి సినిమా వస్తుందంటే మాస్ ప్రేక్షకులకు పండగే. గతంలో ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన 'సింహ', 'లెజెండ్', 'అఖండ' మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్స్‌ను అందుకుని ఆడియెన్స్‌ను ఓ ఊపు ఉపేశాయి. అయితే ఇప్పుడు నాలుగోసారి కూడా ఈ మాస్ కాంబో రిపీట్ కానున్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గానే అఫీషియల్‌గా ప్రకటించారు.
అయితే ఈ సినిమా అఖండ 2నా లేదంటే కొత్త సినిమానా అనేది చాలా రోజులుగా సస్పెన్స్‌లో పెట్టారు మేకర్స్. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. అఖండ 2 అని కన్ఫామ్ చేశారు. అఖండ 2 - తాండవం పేరుతో సీక్వెల్ తెరకెక్కించనున్నట్లు తెలిపారు. టైటిల్ పోస్టర్‌ను నిర్మాణ సంస్థ అఫీషియల్‌గా విడుదల చేసింది. షూట్ త్వరలోనే ప్రారంభం కానుందని పేర్కొంది. కాగా, 2021లో ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ల జాబితాలో చేరింది. దీంతో అఖండ 2ప్రాజెక్ట్‌పై సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది. 14రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట BB4 నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి బాలయ్య కూతురు తేజస్విని కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
కాగా, గతంలో "అఖండలో పసిబిడ్డ, ప్రకృతి. పరమాత్మ కాన్సెప్ట్‌లనే చూపించాం. దీని సీక్వెల్‌లో సమాజానికి కావాల్సిన ఓ మంచి విషయం ఉంటుంది. దైవత్వం మనందరిలో ఒక భాగం. దాన్ని తెరపై చూపిస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు" అని తెలిపారు దర్శకుడు బోయపాటి.