Balagam Director Venu : రీసెంట్గా 'బలగం' చిత్రంతో డైరెక్టర్‌గా తన తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అందుకున్నారు కమెడియన్ వేణు. దాదాపు 25 ఏళ్ళ క్రితమే సినీ పరిశ్రమలోకి వచ్చిన ఆయన మొదట కొన్నాళ్ళ పాటు అసిస్టెంట్‌గా పనిచేసి, ఆ తర్వాత చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ కెరీర్లో పైకి ఎదిగారు. మున్నా సినిమాతో హాస్య నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఆ తర్వాత జబర్దస్త్ షోతో మరింత పాపులర్ అయ్యారు. ఇప్పుడు దర్శకుడిగా మారి సినిమాలు చేయడం ప్రారంభించారు. ప్రస్తుతం తన రెండో సినిమా కోసం పని చేస్తున్నారు.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూ పాల్గొన్న వేణు తాను సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవారో తెలిపారు? అసలు సినిమాలో అవకాశం ఎలా వచ్చింది? ఆర్టిస్టుగా మారడానికి ఆయన చేసిన ప్రయత్నాలేంటి? సహా పలు విషయాలను తెలిపారు.
కూరగాయలు అమ్మేవాడిని : "మా అమ్మానాన్న కూరగాయలు అమ్మేవారు. పావలా కొత్తి మీర అమ్మాలంటే ఎన్నో మాటలు చెప్పాలి. అలా మాటలు చెబుతూ, కూరలు అమ్ముకుంటూ నేను చదువుకున్నాను. అందుకే నన్ను అందరూ వాగుడుకాయ అని అంటుంటారు. అయితే అందరి కన్నా నేను ప్రత్యేకంగా ఉండాలని భావించేవాడిని. అందుకే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను. రెండుసార్లు స్టేట్ ఛాంపియన్‌గా కూడా నిలాచాను. కానీ, అప్పటికే నాకు సినిమాలపై ఆసక్తి ఏర్పడింది. ఏ సినిమా రిలీజైనా చూసేవాడిని. అందరూ నన్ను బాబూమోహన్ బావమరిది అని పిలిచేవారు. దీంతో ఎలా అయినా సినిమాల్లోకి వెళ్లాలని ఇంటి నుంచి వచ్చేశాను" అని చెప్పుకొచ్చారు.