తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

మోదీ బయోపిక్​లో కట్టప్ప సత్యరాజ్​ - PM MODI BIOPIC - PM MODI BIOPIC

PM Modi Biopic SathyaRaj : ప్రధాని మోదీ జీవితంపై మరో బయోపిక్ తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో సీనియర్ నటుడు, బాహుబలి ఫేమ్ కట్టప్ప సత్యరాజ్​ నటించనున్నట్లు సమాచారం అందింది.

Modi Sathyaraj
Modi Sathyaraj (Source ANI)

By ETV Bharat Telugu Team

Published : May 18, 2024, 2:50 PM IST

Updated : May 18, 2024, 2:58 PM IST

PM Modi Biopic SathyaRaj :పాన్ ఇండియా హిట్ బాహుబలిలో కటప్ప పాత్ర ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన నటుడు సత్యరాజ్. అయితే అంతకుముందే చెన్నై ఎక్స్ప్రెస్ లో దీపిక తండ్రి పాత్రలో నటించినా పెద్దగా గుర్తింపు దక్కలేదు. సత్యరాజ్ కు హిందీ సినిమా ద్వారా రాని గుర్తింపు ఒక డబ్బింగ్ మూవీ ద్వారా వచ్చింది. అయితే ఇప్పుడు మరో క్రేజీ న్యూస్ ఇండస్ట్రి లో చక్కర్లు కొడుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్ తెరకెక్కించబోతున్నట్టు ఇండస్ట్రీ ట్రాకర్ రమేష్ బాలా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సంచలనం సృష్టించారు. అయితే రాబోయే బయోపిక్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పాత్రను సత్యరాజ్ పోషించనున్నట్లు టాక్ నడుస్తుంది.

అయితే టైటిల్ రోల్‌లో సత్యరాజ్ నటిస్తున్నారనే విషయం తప్ప రాబోయే బయోపిక్ గురించి వివరాలు ఏవి తెలియలేదు. అయితే 2019లోనే మోదీ బయోపిక్ దర్శకుడు ఒమయుంగ్ కుమార్ తెరకెక్కించాడు. ఇందులో మోదీ పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్ నటించారు. అయితే ఆ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశపర్చింది. వివేక్ నటన ప్రేక్షకులకు కూడా నచ్చలేదు. ఇదే కాదు మోది మీద ఎన్నో సిరీస్, ఇంకా ప్రాంతీయ చిత్రాలు కూడా వచ్చాయి. అయితే సత్యరాజ్ లాంటి సీనియర్ నటుడు మోదీ పాత్రలో నటిస్తున్నారనే వార్త ఆడియెన్స్ కు ఆ సినిమాపై క్రేజ్ పెంచుతుంది.

సత్యరాజ్ కు బయోపిక్స్ లో నటించడం ఇదేం మొదటిసారి కాదు. 2007లో తమిళ సంఘ సంస్కర్త, హేతువాది అయిన పెరియార్ ఈ వి రామస్వామి బయోపిక్ లో నటించారు. ఆ చిత్రానికి తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు స్పెషల్ ప్రైజ్ అందుకున్నారు. ఇక సత్యరాజ్ చివరిగా సింగపూర్ సెలూన్ అనే చిత్రంలో నటించారు. గోకుల్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ఆర్ కే బాలాజీ, మీనాక్షీ చౌదరి లీడ్ రోల్స్ లో నటించారు. ఇందులో లోకేష్ కనకారాజ్, జీవా, అరవింద్ స్వామి అతిథి పాత్రల్లో కనిపించారు. కాగా ప్రస్తుతం వెపన్ అనే మూవీతో థియేటర్లలో సందడి చేయనున్నారు సత్యరాజ్. ఇందులో ఒక అద్భుత శక్తులు ఉన్న వ్యక్తిగా సత్యరాజ్ కనిపించనున్నారు. అతన్ని చంపడానికి ప్రయత్నిస్తున్న హంతకుడిగా వసంత్ కనిపించనున్నారు.

పవన్ విషయంలో అతడిపై రేణూ దేశాయ్ ఫుల్​​ ఫైర్​! - Renu Desai Pawankalyan

కనిపించకుండా పోయిన ప్రముఖ నటుడు - 24 రోజుల తర్వాత ఇంటికి! - Actor Gurucharan Singh

Last Updated : May 18, 2024, 2:58 PM IST

ABOUT THE AUTHOR

...view details