Rajamouli Mahesh Movie Actor sathyaraj :బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్ర పోషించిన సత్యరాజ్ గురించి పరిచయం అక్కర్లేదు. ఆ సినిమాలో రాజమౌళి తీర్చిదిద్దిన పాత్ర అలాంటిది మరి. సింహాసనానికి కట్టుబానిస లాంటి పాత్ర కోసం సత్యరాజ్‌ను ఎంచుకున్న రాజమౌళి - మహేశ్ బాబుతో చేయబోయే సినిమాలోనూ సత్యరాజ్‌కు పాత్ర ఇవ్వనున్నారంటూ ఊహాగానాలు వినిపించాయి. సాధారణంగా కొందరిని సెంటిమెంట్‌గా భావిస్తే రాజమౌళి వాళ్లకు కంటిన్యూస్‌గా పాత్రలు ఇస్తూనే ఉంటారు.
ఇదే ఉద్దేశ్యంతో ఓ మీడియా ప్రతినిధి కూడా వెపన్ అనే తమిళ మూవీ ప్రమోషనల్ పాల్గొన్న సత్యరాజ్‌ను ప్రశ్నించారు. దానిపై స్పందించిన సత్యరాజ్ "నేను దర్శకుడు రాజమౌళికి ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఇండియా వైడ్ ఫ్యామస్ అవ్వడానికి ఆయన నాకిచ్చిన కట్టప్ప పాత్రే కారణం. తను ప్రస్తుతం మహేశ్‌తో తీస్తున్న సినిమాలో నేను నటించడం లేదు. ఒకవేళ ఆయన నన్ను నటించమని అడిగితే కచ్చితంగా ఓకే చెప్తాను" అని బదులిచ్చారు.
బాహుబలి సినిమాలో ముందుగా సిద్ధమైన పాత్ర కట్టప్పేనని రచయిత విజయేంద్ర ప్రసాద్ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. వాస్తవానికి ఈ కట్టప్ప పాత్ర కోసం ముందుగా సంజయ్‌దత్‌ను అనుకున్నారట రాజమౌళి. కానీ, అనుకోని కారణాల వల్ల ఆయన జైలుకు వెళ్లడంతో సత్యరాజ్‌ను అప్రోచ్ అయింది బాహుబలి టీం. ఆ తర్వాత ఆ పాత్ర సాధించిన సక్సెస్ మనకు తెలిసిందే.
రీసెంట్‌గా సత్యరాజ్‌పై మరో రూమర్ వినిపిస్తుంది. నరేంద్ర మోదీపై తెరకెక్కనున్న బయోపిక్‌లో సత్యరాజ్ లీడ్ రోల్ లో కనిపించనున్నారని వార్తలు వినిపించాయి. దానిపై మరోసారి స్పందించిన ఆయన "ప్రధాని మోదీ బయెపిక్‌లో నేను నటిస్తున్నాననే వార్తలు నేను కూడా విన్నాను. అసలు ఆ పాత్ర చేయమని ఇప్పటివరకూ నన్ను ఎవరూ అడగలేదు. ఒకవేళ అది నా దగ్గరకు వస్తే నా స్నేహితుడు మణివన్నన్ డైరక్ట్ చేస్తే నేను నటించేవాడ్ని" అని రియాక్ట్ అయ్యారు.
రీసెంట్‌గా విజయ్ ఆంటోనీ హీరోగా తీసిన మజై పిడికతతా మనిథాన్ సినిమాలో నటించారు సత్యరాజ్. ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కూలీ సినిమాలోనూ నటిస్తున్నారు. గతంలో 1986లో రజనీకాంత్‌తో కలిసి Mr Bharath సినిమాలో నటించిన సత్యరాజ్ మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.
రాజమౌళి, మహేశ్ సినిమాలో ఛాన్స్ - క్లారిటీ ఇచ్చిన కట్టప్ప - Rajamouli Mahesh Movie - RAJAMOULI MAHESH MOVIE
Rajamouli Mahesh Movie Actor sathyaraj : రాజమౌళి - మహేశ్ సినిమాలో కట్టప్ప సత్యరాజ్ నటించనున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయంపై కట్టప్ప క్లారిటీ ఇచ్చారు.
![రాజమౌళి, మహేశ్ సినిమాలో ఛాన్స్ - క్లారిటీ ఇచ్చిన కట్టప్ప - Rajamouli Mahesh Movie Source ETV Bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/30-05-2024/1200-675-21597242-613-21597242-1717080358743.jpg)
rajmouli sathyaraj mahesh (Source ETV Bharat)
Published : May 30, 2024, 8:38 PM IST