తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

దేవకీ నంద‌న వాసుదేవ‌ - మహేశ్‌ బాబు మేనల్లుడి కొత్త సినిమా ఎలా ఉందంటే? - DEVAKI NANDANA VASUDEVA REVIEW

గల్లా జయదేవ్‌ కొడుకు అశోక్ నటించిన కొత్త సినిమా దేవకీ నంద‌న వాసుదేవ‌ రివ్యూ డీటెయిల్స్​.

Ashok Galla Devaki Nandana Vasudeva Review
Ashok Galla Devaki Nandana Vasudeva Review (source Film Poster)

By ETV Bharat Telugu Team

Published : Nov 23, 2024, 6:43 AM IST

Ashok Galla Devaki Nandana Vasudeva Review :సూపర్ స్టార్ మ‌హేశ్‌ బాబు మేన‌ల్లుడు, గల్లా జయదేవ్‌ కొడుకు అశోక్ హీరో చిత్రంతో పరిచయమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు తన రెండో సినిమా దేవ‌కీ నంద‌న వాసుదేవ‌తో వచ్చాడు. ఈ చిత్రానికి హనుమాన్‌ దర్శకుడు ప్రశాంత్‌ వర్మ క‌థ‌ అందించారు. అది కూడా పురాణాల‌తో ముడిప‌డిన క‌థ ఇది. అర్జున్ జంధ్యాల దర్శకుడు. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.

క‌థేంటంటే? - కంస రాజు (దేవదత్త నాగే) అనే క్రూర‌మైన మనస్తత్వమున్న వ్యక్తి, క‌న‌ప‌డిన భూముల‌న్నీ త‌న‌వే అంటూ దోచుకుంటుంటాడు. లేదంటే ప్రాణాల్ని తీసేస్తుంటాడు. అయితే ఓ సారి కాశీ సందర్శనకు వెళ్లిన‌ప్పుడు అక్కడ ఓ అఘోరా చెప్పిన మాట‌తో త‌న సొంత బావ‌ను కూడా చంపేస్తాడు. త‌న చెల్లెలు (దేవ‌యాని)కి పుట్టబోయే మూడో సంతానం నుంచి ప్రాణగండం ఉంద‌ని అఘోరా చెప్తాడు. అందుకే ఆమెను ఒక సంతానానికే ప‌రిమితం చేయాల‌ని ఆ దారుణాం చేస్తాడు.

అయితే కంస‌రాజు జైలు ఊచ‌లు లెక్కపెట్టాల్సిన ప‌రిస్థితి ఏర్పడుతుంది. కొంత కాలం జైలు జీవితం గడిపాక బ‌య‌టికి వస్తాడు. అప్పటికే త‌న చెల్లెలికి పుట్టిన బిడ్డ స‌త్య (మాన‌స వార‌ణాసి) పెరిగి పెద్దవ్వడం, కృష్ణ (అశోక్ గ‌ల్లా)తో ప్రేమ‌లో ప‌డటం జరుగుతుంది. మరి ఆ ఇద్దరి ప్రేమాయ‌ణం కంస‌రాజుకు ఎలా తెలిసింది? స‌త్య ఫ్యామిలీకి సంబంధించిన పూర్తి విష‌యాలు కృష్ణకు ఎప్పుడు తెలిశాయి? అసలు కంస‌రాజు చెల్లెలు దాచిపెట్టిన అస‌లైన ర‌హ‌స్యం ఏమిటి? అనేదే సినిమా.

ఎలా ఉందంటే?

పురాణాల‌తోనూ, అందులోని పాత్రలతోనూ ముడిపెడుతూ క‌థ‌లు చెబుతున్నారు ప్రస్తుత దర్శకులు.అందులో భాగంగా రూపొందిన మ‌రో సినిమానే దేవ‌కీ నంద‌న వాసుదేవ‌. కృష్ణుడు, కంసుడు పాత్రల స్ఫూర్తితో ఈ కథ రాశారు. అయితే కాన్సెప్ట్ ఆక‌ట్టుకునేలా ఉన్న‌ా, క‌థ‌నంలో లోపం ఉండటం వల్ల సినిమా ఆదిలోనే ప‌ట్టు త‌ప్పిపోయింది. తొలి అర‌గంట సినిమాతోనే ఈ సినిమా క‌థాగ‌మ‌నం ఏమిటో అర్థ‌మైపోతుంది.

అక్క‌డ్నుంచి సన్నివేశాలు పెద్దగా మెప్పించ‌వు. ఏదో అలా సాగుతూ వెళ్లిపోతుంటాయి. ప్రేక్ష‌కుడిపై ఎలాంటి ప్ర‌భావం చూపించ‌దు. హీరోయిన్ పాత్ర‌తో లింక్ అయిన ఓ మ‌లుపు కాస్త ఆస‌క్తిని రేకెత్తిస్తుంది. హీరోహీరోయిన్ మ‌ధ్య సాగే ప్రేమక‌థ‌లో బ‌లం లేదు. హీరోయిన్, ఆమె త‌ల్లి బ్యాక్​డ్రాప్​తో వ‌చ్చే సీన్స్​ పెద్దగా ఎమోషన్స్ ఇవ్వవు. క‌థ చెప్ప‌డంలో కొత్త‌ద‌నం లేక‌పోవ‌డం, పాత్ర‌లు, వాటి మ‌ధ్య సంఘ‌ర్ష‌ణ లేదు.

ఎవ‌రెలా చేశారంటే? -అశోక్ గ‌ల్లా న‌ట‌న పర్వాలేదనిపించినా, ఆయనకు ఈ పాత్ర అంతగా అత‌క‌లేదు. పాత్రలో హుషారు క‌నిపించ‌దు. మాన‌స వార‌ణాసిది మాత్రం బ‌ల‌మైన పాత్ర. దేవ‌ద‌త్త నాగె న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. దేవ‌యాని, ఝాన్సీ వాళ్ల పాత్ర‌ల్లో పరిధి మేరకు నటించారు. శ‌త్రు, గెట‌ప్ శ్రీను, సంజ‌య్ స్వ‌రూప్ త‌దిత‌రులు పాత్ర‌లు పర్వాలేదు. ఇత‌ర విభాగాలు కూడా పర్వాలేదు. ప్ర‌శాంత్ వ‌ర్మ క‌థకు త‌గ్గట్టుగా క‌థ‌నం లేకపోవడం మైనస్. అర్జున్ జంధ్యాల యాక్ష‌న్ అంశాల‌పై దృష్టిపెట్టారు. కానీ, క‌థ‌ను మాత్రం కొత్త‌గా చెప్ప‌లేక‌పోయారు. నిర్మాణం ఉన్న‌తంగా ఉంది.

చివ‌రిగా: దేవ‌కీ నంద‌న వాసుదేవ‌, ఓ సాదాసీదా ప్రయత్నం

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

OTTలోకి ఈ ఒక్కరోజే 35 సినిమా/సిరీస్​లు​ - ఆ సూపర్ హిట్ మూవీ కూడా!

కాబోయే కోడలిపై నాగ్​ మామ ప్రశంసలు - ఇంతకీ ఆయన ఏమన్నారంటే?

ABOUT THE AUTHOR

...view details