తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

దెయ్యంతో డేటింగ్ అండ్​ రొమాన్స్​ - ఆసక్తిగా లవ్ మీ టీజర్​ - love me movie teaser

Love Me Teaser : టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాతలు దిల్‌ రాజు, శిరీష్‌ వారసుడిగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చారు ఆశిష్. ఆయన నటించిన మూడో చిత్రం లవ్​ మీ టీజర్ విడుదలైంది. ఈ ప్రచార చిత్రం ఆద్యంతం ఆసక్తిగా సాగింది. దెయ్యానికి బాయ్​ఫ్రెండ్ ఉంటే అనే కాన్సెప్ట్​తో హారర్ నేపథ్యంలో రూపొందిందీ చిత్రం.

దెయ్యంతో డేటింగ్ అండ్​ రొమాన్స్​ - ఆసక్తిగా లవ్ మీ టీజర్​
దెయ్యంతో డేటింగ్ అండ్​ రొమాన్స్​ - ఆసక్తిగా లవ్ మీ టీజర్​

By ETV Bharat Telugu Team

Published : Mar 7, 2024, 6:20 PM IST

Updated : Mar 7, 2024, 6:37 PM IST

Love Me Teaser : రౌడీ బాయ్స్ చిత్రంతో హీరోగా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు అశిష్‌. టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాతలు దిల్‌ రాజు, శిరీష్‌ వారసుడిగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది. అనంతరం సెల్ఫిష్ అనే చిత్రంలో నటించారు. ఇది ఇంకా రిలీజ్ కాలేదు. ఇప్పుడు తన మూడో చిత్రంగా హారర్ సినిమాలో నటించారు. అదే లవ్‌ మీ. If You Dare అనేది ట్యాగ్ లైన్. బేబీతో సూపర్ హిట్ అందుకున్న వైష్ణవి చైతన్య ఈ చిత్ర హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్‌ అరుణ్‌ తెరకెక్కిస్తున్నారు. తాజాగా మేకర్స్​ టీజర్​ను రిలీజ్ చేయగా అది ఆద్యంతం ఆసక్తిగా సాగుతోంది. దెయ్యంతో హీరో ప్రేమ నేపథ్యంలో సినిమాను తెరకెక్కించినట్టు అర్థమవుతోంది.

భయమేసే చోట రొమాన్స్​ ఉంటే ఎగ్జైటింగ్​గా ఉంటుంది ప్రియా అంటూ అశిష్ చెప్పే డైలాగ్​తో ప్రారంభమైంది టీజర్. ఆ తర్వాత అలాగని దెయ్యంతో రొమాన్స్ చేయలేం కదా అర్జున్ అంటూ వైష్ణవి చెప్పే సంభాషణ ఆసక్తిని కలిగిస్తోంది. అలా దెయ్యానికి బాయ్ ఫ్రెండ్ ఉంటే అంటూ ప్రేతాత్మ ప్రేమలో పడిన కుర్రాడిగా ఆశిష్ కనిపించారు.

ఇకపోతే సాధారణంగా పాత పడ్డ బంగ్లాలో దెయ్యం ఉందంటే ఎవరూ అటూ వెళ్లరు. కానీ ఓ యువకుడు మాత్రం ఫలానా బంగ్లాలో దెయ్యం ఉందని తెలుసుకుని, దానితో రొమాన్స్ చేసేందుకు అక్కడికి వెళ్తాడు. దెయ్యానికి బాయ్ ఫ్రెండ్​గా దానితో రొమాన్స్ చేయడంలో ఉండే కిక్ వేరు అంటూ ఆ బంగ్లాలోకి ఎంట్రీ ఇస్తాడు. పైగా ఈ ఆలోచనను తన ప్రియురాలితో పంచుకోడంతో పాటు తనను కూడా అక్కడికి తీసుకెళ్తాడు. మరి అలా వెళ్లిన అతడితో నిజంగానే దెయ్యం ప్రేమలో పడిందా? అసలు వారు ఆ బంగ్లా నుంచి బయటపడ్డారా అనేదే కథాంశం.

ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు. ఆయన అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మరింత ఇంట్రెస్ట్ కలిగిస్తోంది. ఇంకా స్టార్ కెమెరామెన్ పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్​గా వ్యవహరిస్తున్నారు. టీజర్ విజువల్స్ గ్రాండియర్​గా కనిపిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్​ను అనౌన్స్ చేయనున్నారు.

హాస్పిటల్​లో చేరిన స్టార్​ హీరో - ఫ్యాన్స్​ కంగారు!

పెరుగుతున్న సుహాస్ క్రేజ్​ - రూ.1000తో మొదలై ఇప్పుడు ఒక్కో సినిమాకు ఎన్ని కోట్లంటే?

Last Updated : Mar 7, 2024, 6:37 PM IST

ABOUT THE AUTHOR

...view details