Raasi Khanna Latest Photoshoot :రాశీ ఖన్నా గురించి చాలా మంది సినీ ప్రియులకు తెలిసే ఉంటుంది. 2013లో వచ్చిన మద్రాస్ కేఫ్ అనే హిందీ మూవీతో వెండితెరకు పరిచయమైందీ బ్యూటీ. అదే ఏడాది తెలుగులో ఊహలు గుసగుసలాడే చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీలో బొద్దుగా ఉన్న రాశి తెలుగు ఆడియెన్స్‌కు తెగ నచ్చేసింది. అనంతరం కొన్ని సినిమాలు చేసిన ఆమె ఇండస్ట్రీలో నిలబడాలంటే నటనతో పాటు శరీరం మీద దృష్టి పెట్టాలని అనుకున్నట్లు ఉంది. అందుకే తీవ్రంగా కసరత్తులు చేసి మెరుపు తీగలా మారిపోయింది. తెలుగు, తమిళం, హిందీ మూవీస్‌లో కూడా అవకాశాలు సంపాదించుకుంది.
అయితే రాశీ ఖన్నా రీసెంట్గా చేసిన తెలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశపర్చినా సోషల్ మీడియాలో మాత్రం ఈ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. లేటెస్ట్గా రాశి తన ఇన్‌స్టాగ్రామ్‌లో రెడ్ కలర్ లెహంగాతో హాట్ అందాలతో కుర్రకారు మతిపోగొట్టే ఫోటోలు పోస్ట్ చేసింది. అందులో రెడ్ లెహంగాతో పాటు ఆ కలర్‌కు మ్యాచ్ అయ్యే లావుపాటి బ్యాంగిల్స్‌తో ట్రెడిషనల్ లుక్‌లో అదరగొట్టేసింది. ఆ ఫోటోల క్రింద "మంచి టేస్ట్ ఉన్న తుంటరి దెయ్యం" అని క్యాప్షన్ పెట్టింది. ఆ ఫొటోలు పెట్టిన కొన్ని గంటల్లోనే విపరీతమైన లైక్స్ అండ్ కామెంట్స్ వచ్చాయి. కాగా, ఇన్‌స్టాగ్రామ్‌లో రాశీకి 11 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.