తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

అనుపమ గ్లామర్ అంటే ఆ మాత్రం రేట్ ఉంటది - డీజే టిల్లు కోసం అన్ని కోట్లా! - Anupama Parameshwaran Remuneration

Anupama Parameshwaran Remuneration DJ Tillu Sequel : డీజే టిల్లు స్క్వేర్​లో ఊహించని రేంజ్​లో హద్దులు దాటేసి మరీ రొమాన్స్ సీన్స్​, డబుల్ మీనింగ్ డైలాగ్​లు, లిప్​ కిస్​లతో రెచ్చిపోయిన అనుపమ పరమేశ్వరన్​ - ఈ చిత్రం కోసం గట్టిగానే రెమ్యునరేషన్ తీసుకుందట. ఏకంగా అన్ని కోట్లు ఛార్జ్​ చేసిందట. ఆ వివరాలు.

అనుపమ గ్లామర్ అంటే ఆ మాత్రం రేట్ ఉంటది - డీజే టిల్లు కోసం అన్ని కోట్లా!
అనుపమ గ్లామర్ అంటే ఆ మాత్రం రేట్ ఉంటది - డీజే టిల్లు కోసం అన్ని కోట్లా!

By ETV Bharat Telugu Team

Published : Feb 21, 2024, 2:28 PM IST

Anupama Parameshwaran Remuneration DJ Tillu Sequel : అనుపమ పరమేశ్వరన్ - ఇప్పుడీ పేరు వింటే కుర్రాళ్ల గుండెకు చెమటలు పట్టాల్సిందే. ఒకప్పుడు క్లాస్ లుక్స్​లో ట్రెడిషనల్​గా ఉండే పాత్రలు పోషించే ఈమె ఇప్పుడు పూర్తిగా గేర్​ మార్చేసింది. అందాల ఆరబోతతోనే కెరీర్​ను నెట్టుకొచ్చే పరిస్థితికి వచ్చేసింది. తాజాగా విడుదలైన డీజే టిల్లు ట్రైలర్ చూసి యూత్​ అంతా షాకైపోయారు. అనుపమ బోల్డ్​ యాక్టింగ్ చూసి కొంతమందైతే తాము బాగా హర్ట్ అయినట్లు వీడియోలు కూడా రిలీజ్ చేశారు. అయితే తాజాగా ఈ మూవీలో చేసిన గ్లామర్​ షో కోసం అనుపమ ఎంత మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకొచ్చిందో వివరాలు బయటకు వచ్చాయి.

వివరాల్లోకి వెళితే. ప్రేమమ్​తో పరిచయమైన మలయాళి భామ అనుపమ పరమేశ్వరన్ ఆ తర్వాత శతమానం భవతి, వున్నది ఒకటే జిందగీ, కృష్ణార్జున యుద్ధం, తేజ్ ఐ లవ్ యూ, హలో గురు ప్రేమ కోసం వంటి చిత్రాల్లో నటించి యూత్​కు డ్రీమ్ గర్ల్​గా మారిపోయింది.

మొదట్లో అంతా ట్రెడిషనల్​గానే కనిపించినప్పటికీ క్రమక్రమంగా గ్లామర్ డోస్ పెంచింది. ఇన్ని సినిమాల్లో నటించినప్పటికీ స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్​ రావట్లేదు కదా అందుకే గ్లామర్ డోస్ కాస్త పెంచిందని అంతా అనుకున్నారు. అప్పటికీ పెరుగుతున్న ఆమె అందాల ఆరబోతను చూసి సర్దుకుపోయారు యూత్. కానీ ఆ తర్వాత షాక్ అయ్యే రేంజ్​లో డోస్​ను పెంచేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. కుర్రకారుకు నిద్ర లేని రాత్రులను మిగిల్చింది. ఇక రౌడీ బాయ్స్ సినిమాతో లిప్​ లాక్ కిస్ పెట్టడం కూడా మొదలెట్టేసింది. ఫ్యాన్స్ ఫీలవ్వడం ప్రారంభించారు. అయితే ఆ తర్వాత కార్తికేయ 2, 18 పేజీస్ వంటి చిత్రాల్లో ట్రెడిషనల్​గానే కనిపించింది. దీంతో అభిమానులు హమ్మయ్య అనుకున్నారు.

అకానీ డీజే టిల్లు స్క్వేర్​లో ఊహించని రేంజ్​లో హద్దులు దాటేసి మరీ రొమాన్స్ సీన్స్​, డబుల్ మీనింగ్ డైలాగ్​లు, లిప్​ కిస్​లతో రెచ్చిపోయింది. కుర్రాళ్లైతే పరేషాన్ అయిపోయారు. అయితే ఇలా గ్లామర్ ట్రీట్ ఇవ్వడం కోసం అనుమప రెమ్యునరేషన్​ను గట్టిగానే అందుకుందట. ఇప్పటివరకు ఒక్కో సినిమాకు రూ.కోటి నుంచి కోటిన్నర మధ్య రెమ్యునరేషన్ అందుకున్న ఈ ఉంగరాల జుట్టు భామ - 'టిల్లు స్వ‍్కేర్' కోసం మాత్రం రూ.2 కోట్ల వరకు అందుకుందని తెలిసింది. కాగా, మార్చి 29న 'డీజే టిల్లు 2' థియేటర్లలోకి రాబోతుంది.

OTTలోకి తెలుగమ్మాయి నటించిన హాలీవుడ్ చిత్రం - మూవీకి ఫుల్ రెస్పాన్స్​!

డీజే టిల్లునా మజాకా - ఊహించని రేంజ్​లో ఓటీటీ రైట్స్​ డీల్​!

ABOUT THE AUTHOR

...view details