Sharukh Khan Anirudh Movie : గతేడాది పఠాన్, జవాన్, డంకీ అంటూ బ్యాక్ టు బ్యాక్ వరుస హిట్లను అందుకున్న బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ఇప్పటి వరకు తన కొత్త ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేయలేదు. కానీ ఆయన కింగ్ అనే సినిమా చేస్తున్నారని గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసింది. ఈ చిత్రంతోనే షారుక్ కూతురు సుహానా ఖాన్ కూడా వెండితెర అరంగేట్రం చేయనుంది.
అయితే తాజాగా ఈ సినిమా కోసం మరోసారి తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరూధ్తో కలిసి పని చేయనున్నారట షారుక్. అంతకుముందు వీరిద్దరి కాంబోలో వచ్చిన జవాన్ మ్యూజికల్‌గానూ భారీ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. అందుకే అనిరూధ్ టాలెంట్ అండ్ వర్క్ నచ్చి మళ్లీ అతనితో కలిసి షారుక్ పని చేసేందుకు సిద్ధమయ్యారట. ఈ విషయాన్ని సినీ వర్గాలు తెలిపాయి.
"సరికొత్త యాక్షన్ థ్రిల్లర్‌గా కింగ్ సినిమా తెరకెక్కనుంది. ఆడియెన్స్‌కు సరికొత్త మజాను ఇవ్వనుంది. షారుక్ ఖాన్, సిద్ధార్థ్ ఆనంద్, సుజయ్ ఘోష్ కలిసి ఈ సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కీలక పాత్ర పోషిస్తుందని భావించి, ఆ బాధ్యతను అనిరూధ్‌కు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ సినిమా షూటింగ్ ఆగస్ట్ నుంచి మొదలు కానుంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇప్పటికే మొదలైపోయాయి. వీడియో గ్లింప్స్ ద్వారా సినిమా అనౌన్స్‌మెంట్‌ను అఫీషియల్‌గా చెప్పాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం అనిరూథ్ ఈ సినిమా థీమ్ మ్యూజిక్ కోసం పని చేస్తున్నారు." అని సినీ వర్గాలు పేర్కొన్నాయి.