ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / entertainment

ఆరు షోలు, టికెట్‌ ధరలకు గ్రీన్‌సిగ్నల్‌ - భారీగా ఫ్రీ రిలీజ్‌ బిజినెస్ -ఎన్టీఆర్‌ ధ్యాంక్స్‌ - NTR Devara Movie - NTR DEVARA MOVIE

జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. టికెట్‌ ధరల పెంపు, షోల నిర్వహణకు చంద్రబాబు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. సోషల్‌ మీడియాలో కొందరు ఎన్టీఆర్‌ సినిమా విడుదలకు తెలుగుదేశం ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందన్న పోస్టులు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడం గమనార్హం.

NTR Devara
NTR Devara (ETv Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 21, 2024, 1:37 PM IST

Updated : Sep 21, 2024, 2:49 PM IST

జూనియర్‌ ఎన్టీఆర్‌-జాన్వీ కపూర్ ప్రధానపాత్రల్లో నటించిన దేవర మూవీ విడుదలకు ఆంధ్రప్రదేశ్‌లో అన్ని రకాల అనుమతులు లభించాయి. దేవర సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలోని అన్ని సినిమా హాళ్లలో బాల్కనీ టికెట్ ధర రూ.110 కి, దిగువ క్లాస్ టికెట్ ధరలు రూ.60 మేర పెంచుకుందుకు అనుమతి మంజూరు చేశారు. మొత్తం 9రోజుల పాటు స్పెషల్‌ షోలు ప్రదర్శనకు కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. రోజుకు ఆరు షోల చొప్పున ప్రదర్శించుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

'దేవర' స్పెషల్ షోస్​కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
ఈ నెల 27వ తేదీన దేవర సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తారక్ అభిమానులకు శుభవార్త చెప్పింది. సాధారణంగా ప్రధాన హీరోల సినిమాల రిలీజ్ టైమ్‌లో ప్రీమియర్‌ షోస్ ప్రదర్శిస్తుంటారు. అదే విధంగా మొదటివారం టికెట్‌ ధరల పెంపునకు కూడా ఆయా ప్రభుత్వాలు అనుమతిని ఇస్తుంటాయి. ఈ మేరకు 'దేవర' మూవీ టీమ్ కూడా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని కలిసి స్పెషల్‌ షోలు, టికెట్‌ ధరల పెంపునకు పర్మిషన్‌కు అప్లై చేశారు.అందుకు ఆంధ్రప్రదేశ్‌ అధికారులు సానుకూలంగా స్పందించి ఉత్తర్వులు జారీ చేశారు.

NTR Devara Movie release (ETV Bharat)

ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ఇక ఫస్ట్ డే అర్ధరాత్రి ఒంటి గంట షో వేయనున్నారు. అలాగే ప్రధాన హాల్స్‌లో రోజూ ఆరు ఆటలను 9 రోజుల పాటు ప్రదర్శిస్తారు. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కల్లో దేవర అంచనాలను మించింది. నైజాం ప్రాంతంలో 'దేవర' టికెట్లు రూ.45 కోట్లకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. గతంలో కూడా ఎన్టీఆర్‌ నటించిన పలు చిత్రాలు నైజాం ఏరియాలో భారీగానే కలెక్షన్లను రాబట్టాయి.ఈ క్రమంలో ఈ సారి నైజాంలో రూ.50 కోట్ల షేర్ వస్తుందని ట్రేడ్ వర్గాల లెక్క. సీడెడ్‌లో కూడా రూ.22 కోట్ల బిజినెస్ చేసిందని టాక్. సుమారు రూ.25 కోట్ల షేర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

జూనియర్ ఎన్​టీఆర్ మల్టీ ట్యాలెంట్​ - 'దేవర' కోసం ఏకంగా 4 భాషల్లో!

ఇదిలా ఉండగా, విశాఖలో రూ.12.5 కోట్లు, ఈస్ట్ రూ.8 కోట్లు, వెస్ట్ రూ.6 కోట్లు, కృష్ణా రూ. 7 కోట్లు, గుంటూరు రూ. 8.5 కోట్లు, నెల్లూరు రూ. 4 కోట్లు ఫ్రీ రిలీజ్‌ బిజినెస్‌ అని టాక్. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ.115 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు పరిశ్రమ వర్గాల బోగట్టా. కర్నాటక, తమిళనాడు, కేరళలో, యూఎస్‌లో భారీగా బిజెనెస్‌ చేసింది. హిందీ బెల్ట్‌లో కూడా రూ.15 కోట్లు అని సమాచారం. అన్ని ఏరియాలు కలిపి రూ.185 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్ చేసినట్లు సమాచారం. అంటే ఈ లెక్కన రూ.200 కోట్ల షేర్ వసూళ్లు చేస్తే బ్రేక్ ఈవెన్‌ అవుతుంది.

ఎన్టీఆర్‌ ధ్యాంక్స్‌

టికెట్‌ ధరల పెంపు, స్పెషల్‌ షోలకు అనుమతి ఇవ్వడంతో సీఎం చంద్రబాబుకు ఎన్టీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు

గౌరవనీయులైన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌గార్లకు ధన్యవాదాలు. ‘దేవర’ మూవీ విడుదల నేపథ్యంలో టికెట్‌ ధరలు, స్పెషల్‌ షోల ప్రదర్శనకు గ్నీన్‌సిగ్నల్‌ ఇస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. తెలుగు సినిమాలకు సహకారం అందిస్తున్న మీకు కృతజ్ఞతలు. సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కందుల దుర్గేశ్‌గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా’’ అంటూ ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టారు

'దేవర' వీఎఫ్​ఎక్స్​ కోసం 30 రోజులు నిద్ర లేకుండా

Last Updated : Sep 21, 2024, 2:49 PM IST

ABOUT THE AUTHOR

...view details