ETV Bharat / entertainment

'ధైర్యంగా కోలుకుని బయటకు రా' - క్యాన్సర్‌తో పోరాడుతున్న అభిమానికి జూనియర్ ఎన్టీఆర్ వీడియో కాల్ - Jr NTR Video Call to Fan - JR NTR VIDEO CALL TO FAN

Jr NTR Video Call to Fan who Suffers with Cancer: క్యాన్సర్‌తో పోరాడుతున్న ఓ అభిమానికి హీరో జూనియర్ ఎన్టీఆర్ సర్​ఫ్రైజ్​ ఇచ్చారు. ఆ అభిమానికి వీడియో కాల్‌ చేసి ధైర్యం చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే తన జూనియర్​ ఎన్టీఆర్​తో వీడియో కాల్ మాట్లాడే సరికి ఆ అభిమాని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Jr NTR Video Call to Fan
Jr NTR Video Call to Fan (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 14, 2024, 6:03 PM IST

Updated : Sep 14, 2024, 8:13 PM IST

Jr NTR Video Call to Fan who Suffers with Cancer: తనను ప్రేమించే అభిమానులన్నా, వారి కుటుంబసభ్యులన్నా ఎంతో ఆప్యాయత కనబరుస్తుంటారు కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్‌. క్యాన్సర్‌తో పోరాడుతున్న తన అభిమానికి తాజాగా వీడియో కాల్‌ చేసి ధైర్యం చెప్పారాయన. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తిరుపతికి చెందిన కౌశిక్ (19) కొంతకాలంగా బోన్ క్యాన్సర్​తో బాధపడుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కౌశిక్ ఎన్టీఆర్ వీరాభిమాని కావడంతో తాను చనిపోయేలోపు 'దేవర' చూడాలని కోరుకుంటున్నట్లు తల్లిదండ్రులకు చెప్పాడు. కౌశిక్ తల్లి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ద్వారా ఆ విషయాన్ని తారక్ దృష్టికి తీసుకెళ్లారు. అంతే కాకుండా తన కుమారుడి వైద్యానికి రూ.60 లక్షలు ఖర్చు అవుతుందని ప్రభుత్వం, దాతలు సాయం చేయాలని కౌశిక్‌ తల్లి మీడియా ఎదుట కోరారు. వెంటనే స్పందించిన జూనియర్ ఎన్టీఆర్ కౌశిక్​కు వీడియో కాల్ చేసి ఆప్యాయంగా పలకరించారు. కౌశిక్ ధైర్యంగా కోలుకొని బయటకు రావాలని, దేవర సినిమా చూడాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులు కౌశిక్​ను జాగ్రత్తగా చూసుకోవాలని ఎన్టీఆర్ సూచించారు.

''ధైర్యంగా కోలుకుని బయటకు రావాలి. 'దేవర' చూడాలి. సినిమా అనేది తర్వాత నువ్వు ముందు కోలుకుని రావాలి. తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలి" అని ఎన్టీఆర్‌ అన్నారు. "అన్నా మిమ్మల్ని చూస్తానని అస్సలు అనుకోలేదు" అని కౌశిక్‌ అనగా "నేను మాట్లాడకపోతే ఎట్లా నీతో" అని తారక్‌ ఆప్యాయత కనబరిచారు.

'ధైర్యంగా కోలుకుని బయటకు రా' - క్యాన్సర్‌తో పోరాడుతున్న అభిమానికి జూనియర్ ఎన్టీఆర్ వీడియో కాల్ (ETV Bharat)

Devara Run Time: గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన 'దేవర పార్ట్ 1' సినిమా నుంచి రీసెంట్​గా రిలీజైన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసింది.​ అంతేకాకుండా యూట్యూబ్​లో ట్రెండింగ్​లో నిలిచి లక్షల వ్యూస్​తో దూసుకుపోతోంది. అయితే సెప్టెంబర్ 27న సినిమా గ్రాండ్​గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్​ ప్రారంభించారు. ఇక తాజాగా సెన్సార్ పనులు కూడా పూర్తయ్యాయి.

ఈ సినిమాకు సెన్సార్‌ బోర్డు యూ/ఏ (U/A) సర్టిఫికెట్‌ జారీ చేసింది. కాగా, సినిమా రన్​టైమ్​ 2 గంటల 57 నిమిషాల 58 సెకన్ల పాటు ఉండనుంది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ 'జనతా గ్యారేజ్' తర్వాత ఎన్టీఆర్​తో తీసిన సినిమా కావడం వల్ల దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక మూవీలో విజువల్స్‌ అద్భుతంగా ఉంటాయని, చివరి 40 నిమిషాలు సినిమాలో హైలైట్‌ అని హీరో ఎన్టీఆర్ ముంబయిలో జరిగిన ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో ఎన్టీఆర్‌ అంచనాలు రెట్టింపు చేశారు.

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ సినిమాలో హీరోయిన్​గా నటిస్తోంది. సీనియర్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్​ పాత్ర పోషించారు. ఇక మరాఠీ భామ శృతి మరాఠే కీలప పాత్రలో కనిపించనుంది. నటులు శ్రీకాంత్, గెటప్ శ్రీను తదితరులు ఆయా పాక్రలు పోషించారు. మ్యూజిక్ సంచలనం అనిరుధ్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఇప్పటికే రిలీజైన మూడు పాటలకు కూడా మంచి క్రేజ్ లభించింది.

'దేవర' పాన్ ఇండియా ప్రమోషన్స్ ​- సందీప్ వంగాతో, కపిల్​ శర్మతో తారక్ నవ్వులే నవ్వులు! - NTR Devara Promotions

'కౌన్‌ బనేగా కరోడ్‌పతి'లో పవన్‌ కల్యాణ్‌పై ప్రశ్న - ఏమని అడిగారంటే? - Kaun Banega Crorepati Pawan Kalyan

Last Updated : Sep 14, 2024, 8:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.