national cinema day offer: జాతీయ సినిమా దినోత్సవాన్ని పురష్కరించుకుని సెప్టెంబర్ 20న సినీ ప్రియులకు ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (MAI). కేవలం రూ. 99తో మీకు ఇష్టమైన సినిమాను మల్టీఫ్లెక్స్‌లో చూడవచ్చని మల్టీఫ్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. సెప్టెంబర్ 20న దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన నగరాల్లోని4 వేలకు పైగా స్క్రీన్లలో కేవలం 99 రూపాయలకే నచ్చిన సినిమాని వీక్షించవచ్చు. అయితే ఈ అవకాశాన్ని 3D, రెక్లైనర్లు, ప్రీమియం ఫార్మాట్ స్క్రీన్లకు ఈ ఆఫర్ వర్తించదు. ఇక ఆలస్యం లేకుండా వెంటనే శుక్రవారం టికెట్ బుక్‌చేసుకోండి
హైదరాబాద్‌లోని PVR, INOX, మిరాజ్, ఏషియన్, సినీపోలీస్ వంటి ప్రధాన మల్టీప్లెక్స్‌లో కూడా కల్పిస్తున్నారు. ఈ మల్లీఫ్లెక్స్‌లో ప్రదర్శిస్తున్న అన్ని సినిమాలను కూడా రూ. 99కే ఒక టికెట్ ఇస్తున్నారు. ఈ ఆఫర్ ఆరోజు ప్రదర్శించే అన్ని సినిమాలతో పాటు అన్ని షోలకు వర్తిస్తుందని ఎంఏఐ తెలిపింది. ఒక లాగిన్‌పై ఆరు టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
99 రూపాయల టిక్కెట్ ఆఫర్‌ను పొందడానికి ఆన్‌లైన్‌లో కూడా అవకాశం ఉంది. ఆన్‌లైన్‌లోని సినిమా బుకింగ్ సైట్స్‌లోకి వెళ్లి మీ లొకేషన్‌ని ఎంచుకుని, సెప్టెంబర్ 20వ తేదీని సెలక్ట్ చేసి ఆపై మీరు చూడాలనుకుంటున్న సినిమా పేరును ఎంచుకోండి.అటు తర్వాత బుక్ యువర్ టికెట్ ఆప్షన్‌కు వెళ్లి మీ సీటును రిజర్వ్ చేసుకుని చెల్లింపులు పూర్తి చేయాలి. ఇలా ఆన్‌లైన్‌లోనే కాకుండా సమీపంలోని సినిమా థియేటర్, మల్టీప్లెక్స్‌కు నేరుగా వెళ్లి కూడా సినిమా పేరు చెప్పి 99 రూపాయలకు టికెట్ కొనుగోలు చేసి ఎంజాయ్ చేయవచ్చు.
దేశవ్యాప్తంగా సినిమా ధియేటర్స్‌కు వచ్చే ప్రేక్షకుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుందని ఇప్పటికీ 75శాతం ఆక్యూపెన్సీ ఉంటుందని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. MAIలో దేశవ్యాప్తంగా 11సంస్థలకు చెందిన 5000 మల్టీప్లెక్స్ స్క్రీన్లు సభ్యులుగా ఉన్నాయి. దేశంలో రోజు రోజుకూ OTTలకు ఆదరణ పెరగడం, ధియేటర్స్‌కు, మల్టీప్లెక్స్‌క వెళ్లే వారి సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో MAI ఇలాంటి ఆఫర్ ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.