తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'నాదీ తెలంగాణే - నాకు సింపథీ అవసరం లేదు' - వారికి అనసూయ స్ట్రాంగ్ కౌంటర్ - Anasuya Bharadwaj Latest Comments

Anasuya Bharadwaj Latest Comments : తనపై వచ్చే కామెంట్స్​కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే యాంకర్ అనసూయ. తాజాగా కూడా ఓ నెటిజన్​కు తనదైన శైలిలో రిప్లై ఇచ్చింది.

Anasuya Bharadwaj Latest Comments
Anasuya Bharadwaj Latest Comments

By ETV Bharat Telugu Team

Published : Apr 4, 2024, 7:44 PM IST

Anasuya Bharadwaj Latest Comments :నెట్టింట తనపై వచ్చే కామెంట్స్​కు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంటుంది బుల్లితెర యాంకర్ అనసూయ. తాజాగా కూడా ఓ నెటిజన్​ తన గురించి ట్విట్టర్ వేదికగా కామెంట్ చేయగా, దానికి అనసూయ తనదైన శైలిలో రిప్లై ఇచ్చింది.

"ఎందుకు కార్తీక్‌ అస్తమానం నన్ను లాగుతుంటారు. ఎవరు ఏం మాఫియా చేస్తున్నారో నేను ఎప్పుడో చెప్పి దాని గురించి ఇప్పుడు వదిలేశాను. అనవసరంగా నేనే హైప్‌ ఇస్తున్నానంటూ అది నిజమే అనుకుని వదిలేశాను. నేను కూడా తెలంగాణ బిడ్డనే. కానీ, నాకు సానుభూతి అక్కర్లేదు. నాకు నా మీద నమ్మకం, దేవుడి మీద నమ్మకం, మా అమ్మానాన్నలు నాకిచ్చిన విలువలు, పెంపకం, నన్ను నా దృష్టిలో ఎప్పుడూ దిగజారనివ్వవు. ఇప్పుడు ఈ ట్వీట్‌ని కూడా తమ స్వార్థానికి వాడుకున్నా కూడా నేను ఏమీ ఆశ్చర్యపోను. కానీ, నాకు వాళ్లకూ అస్సలు ఎటువంటి సంబంధం లేదు. అన్నట్లు నాకు తెలిసి మీరు, నేనూ చుట్టాలం అస్సలు కాదు. నేను మీకు ఆంటీ కానేమో. అయినా మీ ఇంట్లో ఒకసారి అడగండి. మీకు తెలియకుండా రిలేషన్స్‌ ఉన్నాయేమో. ఎందుకంటే చుట్టాలైతేనే ఆ పలకరింపులు ఉంటాయని నాకు మా పెద్ద వాళ్లు నేర్పించారు. ఏదేమైనా మీకు అంతా మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను" అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.

మరోవైపు తాజాగా "మిమ్మల్ని ట్రోల్‌ చేసేవారికి ఏం చెప్పాలనుకుంటున్నారు?" అని ఓ నెటిజన్ అడగ్గా, దానికి కూడా ఆమె గట్టిగా ఆన్సర్ చెప్పింది. "ట్రోలర్స్‌ అంటే వికారమైన జీవులు. వాళ్లకు ఎంత దూరంగా ఉంటే మనకు అంత మంచిదని నేను తెలుసుకున్నాను. వాళ్లకు ఏదో ఒకటి చెప్పి నా టైమ్‌ వేస్ట్‌ చేసుకోవాలని అనుకోవడం లేదు" అని బదులిచ్చారు.

ఇక అనసూయ ఓ వైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవల 'రజకార్‌' మూవీలో పోచమ్మగా నటించింది. తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు 'పుష్ప2'లో దాక్షాయణిగా అలరించేందుకు సిద్ధమవుతోంది.

'నా పేరుకు, డ్రెస్సింగ్ స్టైల్​కు అస్సలు సంబంధమే లేదు- అప్పుడే నాకు బుద్ధి వచ్చి!'

Tollywood Mother In Law Characters : అనసూయ టు నదియా.. అత్త పాత్రల్లో అదరగొట్టిన నటీమణులు వీరే!

ABOUT THE AUTHOR

...view details