Sharukh Suhana Khan Movie : రీసెంట్గా రిలీజైన కల్కి 2898 ఏడిలో అశ్వత్థామగా అదరగొట్టిన బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం ఆనందంలో మునిగి తేలుతున్నారు. కెరీర్లో ఎన్నో సూపర్ హిట్లు అందుకున్న ఆయన తన కొడుకు అభిషేక్ బచ్చన్‌ను మాత్రం బ్లాక్ బస్టర్ సక్సెస్ ట్రాక్‌లోకి తీసుకురాలేకపోయారు!
Abhishek Bachan Career : అభిషేక్ కెరీర్లో ధూమ్ లాంటివి బ్లాక్ బస్టర్ హిట్ ఉన్నప్పటికీ అవి జాన్ అబ్రహం, హృతిక్ రోషన్కే ఎక్కువ క్రేజ్ తెచ్చిపెట్టాయి. ఏదేమైనా తండ్రి లెగసిని ఆ స్థాయిలో కొనసాగించలేకపోయాడనే అసంతృప్తి బిగ్ ఫ్యాన్స్‌లో ఇప్పటికీ ఉంది. కానీ ఆయనకు సరైన పాత్ర దొరికితే అదరగొడతారని మణిరత్నం రావణ్‌తో బయటపడింది. ఈ మధ్యే దస్వీ అనే వెబ్మూవీతో మంచి హిట్‌నే అందుకున్నారు. దీంతో ఆయన రూటు మార్చబోతున్నారు. ఈ క్రమంలోనే ఆయన విలన్‌గా నటించబోతున్నారని ప్రచారం సాగింది.
ఎందులో అంటే ? - గతేడాది వరుస విజయాలు అందుకున్న బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ప్రస్తుతం కింగ్ అనే చిత్రంలో నటిస్తున్నట్లు తెలిసింది. కూతురు సుహానా ఖాన్‌తో కలిసి ఈ సినిమాలో నటిస్తున్నారట. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోందీ చిత్రం. ఇందులో షారుక్, సుహాన గురుశిష్యులుగా నటించనుండగా, సుజయ్ ఘోష్ దర్శకత్వం వహిస్తున్నారు.