తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఆ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్​కు 'అమరన్' హీరో స్పెషల్ గిఫ్ట్ - ఏం ఇచ్చారంటే? - SIVA KARTHIKEYAN GV PRAKASH KUMAR

మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్​కు శివ కార్తికేయన్ స్పెషల్ గిఫ్ట్​ - ఏంటంటే?

Siva Karthikeyan Special Gift To GV Prakash
Siva Karthikeyan (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 9, 2024, 5:38 PM IST

Amaran Movie Siva Karthikeyan G. V. Prakash Kumar : ఈ దీపావళికి రిలీజైన చిత్రాలన్నీ సూపర్ హిట్​గా నిలిచిన సంగతి తెలిసిందే. అందులో శివ కార్తికేయన్​, సాయి పల్లవి కలిసి నటించిన 'అమరన్' కూడా ఒకటి. ఈ చిత్రం మరో వారం రోజుల పాటు థియేటర్లలో తన జోరు కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. కేవలం తమిళంలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ చిత్రం మంచి రెస్పాన్స్​తో దూసుకెళ్తోంది.

అయితే రాజ్‌కుమార్ పెరియాసామి దర్శకత్వం వహించిన ఈ 'అమరన్' చిత్రానికి కోలీవుడ్ స్డార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్‌ సంగీతం అందించారు. ఆయన కట్టిన బాణీలే ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్‌తో పాటు ఎమోషన్ సన్నివేశాలకు మరింత బలాన్ని అందించింది. అంతేకాకుండా ఆడియెన్స్​ను సినిమాలో లీనమయ్యేట్టు చేసింది. దీంతో జీవీ ప్రకాశ్​కు ఖరీదైన బహుమతిని అందించారు 'అమరన్' హీరో శివ కార్తికేయన్. ఈ మేరకు సోషల్ మీడియాలో జీవీ ప్రకాశ్ కుమార్‌ ఓ పోస్ట్ చేశారు.

అదేంటంటే? - తనకు శివ కార్తికేయన్ కాస్ట్లీ స్టైలిష్​ వాచ్​ను గిఫ్ట్‌గా ఇచ్చినట్లు జీవీ ప్రకాశ్ కుమార్‌ తెలిపారు. టీఏజీ హ్యూయర్ మెన్స్ ఫార్ములా- 1 అనే బ్రాండ్​ తయారు చేసిన స్టెయిన్ లెస్ స్టీల్ స్టైలిష్ వాచ్‌ను తనకిచ్చినట్లు పేర్కొన్నారు. అయితే ఈ వాచీ ధర దాదాపు రూ.3 లక్షల మేరకు ఉంటుందని అంచనా.

కాగా, ఈ 'అమరన్' చిత్రం దివంగత మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్‌గా రూపొందింది. దీన్ని సీనియర్ నటుడు కమల్ హాసన్ తన రాజ్ కమల్ బ్యానర్‌పై సోనీ పిక్చర్స్‌తో కలిసి సంయుక్తంగా నిర్మించారు. తెలుగు, తమిళంలో మంచి ఆదరణను అందుకున్న ఈ చిత్రం, కన్నడ మలయాళంలో మాత్రం కాస్త తక్కువగా ఆకట్టుకుంది. అక్కడ నామమాత్రపు కలెక్షన్లతో సరిపెడుతోంది.

ఓటీటీలోకి ఎప్పుడంటే -మరోవైపు 'అమరన్' చిత్రం నవంబరు చివర్లోనే ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ఈ సినిమాను భారీ ధరకు నెట్‌ప్లిక్స్‌ కొనుగోలు చేసినట్లు తెలిసింది. అయితే ఈ సినిమా భారీ విజయం సాధించడం వల్ల ఓటీటీలోకి ఈ సినిమా కాస్త ఆలస్యంగా అయినా రావొచ్చని అంటున్నారు.

'అమరన్'​తో శివ కార్తికేయన్ రేర్​ ఫీట్​!-మూడు రోజుల్లో రూ.100 కోట్ల క్లబ్​లోకి!

'అమరన్' రివ్యూ - శివకార్తికేయన్ యాక్షన్ వార్ ఎలా ఉందంటే?

ABOUT THE AUTHOR

...view details