Pushpa 2 kissik song Promo Released :దర్శకుడు సుకుమార్ తెరకెక్కించే సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌కు ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. 'పుష్ప' ఫ్రాంచైజీలో సాంగ్స్ మాత్రమే కాదు... సుకుమార్ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ అంటే కళ్ళు మూసుకుని మరీ బ్లాక్ బస్టర్ అని చెప్పవచ్చు. ఆయన మొదటి సినిమా 'ఆర్య'లో 'అ అంటే అమలాపురం' నుంచి 'రంగస్థలం'లో 'జిల్ జిల్ జిగేల్ రాణి' వరకు, ఆ తర్వాత పుష్పలో 'ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ' అన్నీ శ్రోతలను ఉర్రూతలూగించినవే.
అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ - రాక్ స్టార్ దేవీ శ్రీప్రసాద్ కలిసి చేసే సినిమాల్లోని స్పెషల్ సాంగ్స్ వేరె లెవెల్ ఉంటాయి. శ్రోతలను మరింత ఉర్రూతలూగిస్తాయి. ఇక ఇప్పుడు 'పుష్ప 2: ది రూల్'లో అంతకుమించి అనేలా శ్రీలీల 'కిస్సిక్' సాంగ్ రెడీ అయిందని అర్థమైంది. నవంబర్ 24న దీన్ని రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మేకర్స్ 'కిస్సిక్' ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమో చూస్తుంటే సాంగ్ అంతకు మించి అనే ఫీలింగ్ కలిగిస్తోంది.
గతంలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న 'పుష్ప: ది రైజ్'లో 'ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ' సాంగ్ ఎంతటి ప్రేక్షకదరణ పొందిందో తెలిసిన విషయమే. స్టార్ హీరోయిన్ సమంత ఈ పాటలో చిందులేశారు. అది ప్రేక్షకులను ఓ ఊపు ఉపేసింది. అందుకే ఇప్పుడు పుష్ప 2 స్పెషల్ సాంగ్‌పై అంచనాలు భారీగా పెరిగాయి.