Allu Ayaan Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఇండియా వైడ్‌గా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఈ ఒక్క చిత్రంతో బన్నీ ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. ఇతర హీరోల అభిమానులు కూడా బన్నీని లైక్ చేయడం మొదలుపెట్టారు. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్‌తో బిజీగా ఉన్న బన్నీ ఖాళీ దొరికితే తన ఫ్యామిలీతోనూ ఎక్కువగానే సమయం గడుపుతుంటాడు. అయితే అల్లు అర్జున్‌కు కొడుకు అల్లు అయాన్, కూతురు అల్లు అర్హ ఉంది.
ఇప్పటికే అల్లు అర్హ - సమంత శాకుంతలం చిత్రంతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చి తన ముద్దుముద్దు మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు అయాన్ కూడా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కోసం సిద్ధమవుతున్నాడని తెలిసింది. దీని కోసం బన్నీ ఓ సూపర్ ప్లాన్ వేశారని టాక్ వినిపిస్తోంది. అల్లు అయాన్ ఇప్పటికే మోడల్‌గా క్రేజ్ సంపాదించుకుంటున్నాడు. రీసెంట్గా షారుక్ ఖాన్ పాట పాడి నెట్టింట్లో మరింత ఫేమస్ అయ్యాడు.
ఈ క్రమంలోనే అల్లు అర్జున్ - అల్లు అయాన్‌కు వస్తున్న క్రేజ్ చూసి అతడిని కూడా సినిమా ఎంట్రీ ఇచ్చేలా ప్లాన్ చేయాలని ఆలోచిస్తున్నారట. ఇందుకోసం పుష్ప 2లో ఓ పాత్రను సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. కెమియోగా పుష్ప 2లో అయాన్ కనిపిస్తాడని ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో నిజం ఎంతో తెలియదు కానీ నిజమైతే బాగుండని అల్లు ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.