Alluarjun Sukumar Arya Movie :అల్లు అర్జున్ కెరీర్‌లో గంగోత్రీనే మొదటి సినిమా అయినా సక్సెస్ పరంగా ఆర్యనే ఫస్ట్ అని చెప్పుకోవాలి. బన్నీ ఒక్కడికే కాదు ఎందరో కెరీర్‌లు సక్సెస్‌ఫుల్‌గా కొనసాగడానికి గొప్ప శుభారంభాన్ని పలికిన చిత్రమిది. తెలుగు సినిమాల్లో ప్రేమ కథ అంటే ఆర్య ముందు ఆర్య తర్వాత అనుకునేలా విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఈ చిత్రం. సినిమా రిలీజ్ అయి 20 ఏళ్లు గడిచినా ఇప్పటికీ అందులోని ప్రతి డైలాగ్, ప్రతి సన్నివేశం, ప్రతీ పాట గుర్తుండిపోయింది అంటే ఈ చిత్రం అందరి మనసుల్లోకి ఎలా చొచ్చుకుపోయిందో తెలుసుకోవచ్చు.
2004 మే 7న రిలీజ్ అయిందీ చిత్రం. 99 ప్రింట్స్‌తో విడుదల చేసిన చిత్రాన్ని మూడో వారానికి 150 ప్రింట్లకు పెంచారు. క్యాసెట్లతో నడిచే సమయంలో రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియో కూడా సూపర్ హిట్టే. రిలీజ్ కావడానికి ముందే రెండు లక్షల క్యాసెట్లు సేల్ అయి రికార్డు సృష్టించాయి. దేవీ శ్రీ ప్రసాద్ కెరీర్‌లోనే ఆర్య ఇచ్చిన హైప్ మరే సినిమా తీసుకురాలేదు. అతనొక్కడికే కాదు నటుడిగా అల్లు అర్జున్ తో పాటు దర్శకుడిగా సుకుమార్‌కు, నిర్మాతగా దిల్ రాజుకు, డీఓపీగా రత్నేవేలుకి, డిస్ట్రిబ్యూటర్‌గా బన్నీ వాసుకు ఆర్య మంచి బ్రేక్ ఇచ్చింది. వాళ్ల కెరీర్‌లోనే ఓ మైలు రాయిగా నిలిచిపోయింది.
"అను తన మనసులో నన్ను తిట్టుకుంటుందంటే, నా లవ్ ఫీల్ అయినట్టే కదరా" అని బన్నీ చివరి వరకూ పాజిటివ్‌గానే లవ్ సక్సెస్ కోసం నిస్వార్థంగా ప్రయత్నిస్తూ ప్రేమను కనబరుస్తాడు. సుకుమార్ దర్శకత్వం వహించిన అంతటి స్వచ్ఛమైన ప్రేమ కథలో యాక్టింగ్, డ్యాన్స్, స్టైల్ ఇలా అన్నీ తెరపై పర్‌ఫెక్ట్‌గా కనబరిచి ఒక్కసారిగా సౌత్ ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపుకు తిప్పేసుకున్నాడు బన్నీ. తెలుగు ప్రేక్షకులతో పాటు మళయాలీ ఇండస్ట్రీ అభిమానులను సొంతం చేసుకుని మల్లు అర్జున్ అయిపోయాడు.
ఆ రెండు సినిమాలు ప్లాప్ కావడంతో - ఆర్య చిత్రం విడుదల అయిన వారానికే అప్పట్లో ప్రిన్స్‌గా క్రేజ్ సంపాదించుకున్న మహేశ్ బాబు 'నాని' సినిమా రిలీజ్ అయింది. రెండు వారాల విరామంతో యంగ్ రెబల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న అడవి రాముడు రిలీజ్ అయింది. అప్పటికే స్టార్‌డమ్ సంపాదించుకున్న వారిద్దరి సినిమాలు బాక్సాఫీసు వద్ద కాస్త నిరాశపరచడం వల్ల 'ఆర్య' సినిమా దూసుకుపోయింది. వంద రోజులకు 56 సెంటర్స్ పూర్తి చేసుకుని రికార్డు క్రియేట్ చేసింది.
మొదట ఆ హీరో అనుకున్నారు - 'దిల్' సినిమా స్పెషల్ షోకు అల్లు అర్జున్, సుకుమార్ కూడా వెళ్లారట. అక్కడ బన్నీని చూసిన సుకుమార్ తన కథలోని క్యారెక్టర్‌కు సరిగ్గా సరిపోతాడని భావించాడట. వెంటనే ఆ మాట దిల్ రాజుకు చెప్పడంతో కథా ప్రయత్నాలు మొదలయ్యాయి. చిరంజీవి, అల్లు అరవింద్ కథకు ఓకే చెప్పడంతో బన్నీతో కలిసి 'నచికేత' వర్కింగ్ టైటిల్‌తో సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. ఆ తర్వాత దానిని ఆర్యగా ఫిక్స్ చేసి రిలీజ్ చేయడంతో ప్రభంజనం సృష్టించింది. వాస్తవానికి ఈ కథను అల్లరి నరేశ్ కోసం సుకుమార్ రాసుకున్నారట. కానీ దానిని మార్పులు చేసి బన్నీ హీరోగా ఆర్య చేశారు.