Allu Arjun Sneha Reddy Post : పుష్ప చిత్రంతో ఇండియా వైడ్‌గా క్రేజ్ సంపాదించుకున్నారు అల్లు అర్జున్. స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్‌గా ఎదిగారు. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ పుష్ప 2తో బిజీగా ఉన్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగస్టు 15న రిలీజ్ కానుంది. అయితే ఓ వైపు సినిమా షూటింగ్లో ఉంటూనే మరోవైపు ఖాళీ దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తన పెళ్లి రోజు సందర్భంగా భార్య స్నేహారెడ్డి గురించి అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
"మన పెళ్లై 13 ఏళ్లు అయిపోయింది. నేను ఇలా ఉండటానికి కారణం నీతో ఉన్న బంధమే. నీ ప్రశాంతత గుణంతో నాకు బోలెడంత శక్తిని ఇచ్చావు. మరెన్నో వార్షికోత్సవాలు ఇలానే జరుపుకోవాలని కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ క్యూటీ" అని అల్లు అర్జున్ తన భార్యతో కలిసి ఉన్న ఫొటోనూ పోస్ట్ చేసి ఇన్ స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇది నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
కాగా, నిర్మాత అల్లు అరవింద్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు అల్లు అర్జున్. సినిమా సినిమాకు నటనలో వైవిధ్యం చూపిస్తూ స్టార్ హీరోగా ఎదిగారు. తెలుగుతో పాటు మలయాళంలోనూ క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ జర్నీలోనే పర్సనల్ లైఫ్‌లో 2011లో స్నేహారెడ్డిని పెళ్లి చేసుకున్నారు. వీళ్లకు అయాన్, అర్హ జన్మించారు. ఇక రెండేళ్ల క్రితం పుష్ప చిత్రంతో పాన్ ఇండియా రేంజ్లో అభిమానగణాన్ని క్రేజ్ దక్కించుకున్నారు.