Allu Arjun NBK Unstoppable Season 4 : తెలుగునాట సూపర్ సక్సెస్‌గా దూసుకెళ్తున్న 'ఎన్బీకే అన్‌స్టాపబుల్ సీజన్ 4' షో కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్‌గా వచ్చారు. 'పుష్ప ది రూల్' ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన ఈ ప్రోగ్రామ్‌కు విచ్చేశారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.
ఆమె సర్‌ప్రైజ్ ఎంట్రీ!
అయితే ప్రోమోలో ఎన్నో ఆసక్తికరమైన ఘటనలు జరిగాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ తల్లి నిర్మల రావడం ప్రోగ్రామ్‌కే స్పెషల్ అట్రక్షన్‌గా నిలిచింది. మా బెజవాడ ఆడపడుచు. మా రామలింగయ్య గారి కోడలు. నిర్మల గారు ఆన్ ది స్టేజ్" అంటూ బాలయ్య ఆమెను సాదరంగా ఆహ్వానించారు. అది చూసి బన్నీ కూడా ఇది నిజంగా నాకే సర్‌ప్రైజ్. అంటూ " అని బన్నీ నవ్వారు. ఇక బన్నీ తల్లి కూడా తమ ఫ్యామిలీ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు మాట్లాడారు.
ఇదిలా ఉండగా, ఈ వేదికలో నేషనల్ అవార్డు గురించి అల్లు అర్జున్ మాట్లాడారు. తెలుగులో ఒక్కరికి కూడా ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు రాకపోవడం తనని బాధించిందని, అందుకే ఎలాగైనా ఆ ఘనతను సాధించాలని అనుకున్నా అంటూ తెలిపారు. అంతే కాకుండా చిరంజీవి, మహేశ్‌బాబుతో పాటు పలువురు కో స్టార్స్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అమ్మాయిల విషయంలో ఏదైనా అన్యాయం జరిగితే మాత్రం తనకు చాలా కోపం వస్తుందని అన్నారు. ఇక నవంబర్ 15న ఈ ఎపిసోడ్ పార్ట్ 1 ప్రసారం కానుంది.