Allu Arjun Germany Trip :'పుష్ప పార్ట్ 2' సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే జర్మనీకి పయనమయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఆయన సడెస్గా ఎందుకు వెళ్తున్నారని ఫ్యాన్స్ నెట్టింగ తెగ కామెంట్లు పెడుతున్నారు.
ఇక జర్మనీలో జరగనున్న 74వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆయన పాల్గొనడానికి వెళ్లారట. అక్కడ 'పుష్ప: ది రైజ్' సినిమాను స్పెషల్ స్క్రీనింగ్ వేసేందుకు ఫెస్టివల్ నిర్వాహకులు నిర్ణయించారట. ఈ నేపథ్యంలో ఆయన మూవీ టీమ్ తరఫున ఈ సత్కారాన్ని అందుకునేందుకు అక్కడికి వెళ్లారట.
Allu Arjun Upcoming Movies : ఇక బన్నీ లైనప్ చూస్తే - 'పుష్ప2' షూటింగ్ పూర్తయిన తర్వాత తన తదుపరి చిత్రాన్ని మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో చేయబోతున్నారు అల్లు అర్జున్. కొద్ది రోజుల క్రితమే బన్నీ.. బోయపాటితో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దీని తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో కలిసి ఓ భారీ సోషియో ఫాంటసీ సినిమా చేసేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. దీనికంటే ముందే 'యానిమల్' డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో ఓ యాక్షన్ మూవీ చేసేందుకు ఒప్పుకున్నారు ఐకాన్ స్టార్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా కొద్ది నెలల క్రితమే వచ్చింది.