తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

బన్ని, అట్లీ సినిమా క్యాన్సిల్- కారణం అదేనా? - Allu Arjun Atlee Movie - ALLU ARJUN ATLEE MOVIE

Allu Arjun Atlee Movie: స్టార్ హీరో అల్లు అర్జున్- అట్లీ కాంబోలో తెరకెక్కాల్సిన ప్రాజెక్ట్ ఆగిపోయిందట. మరి దానికి కారణం ఏంటో తెలుసా?

Allu Arjun Atlee
Allu Arjun Atlee (ANI (Left), ETV Bharat (RIght))

By ETV Bharat Telugu Team

Published : Jun 16, 2024, 9:12 AM IST

Updated : Jun 16, 2024, 10:04 AM IST

Allu Arjun Atlee Movie:ఐకాన్​స్టార్ స్టార్ అల్లు అర్జున్​- స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో ఓ ప్రాజెక్ట్ తెరకెక్కనుందని కొన్ని నెలలుగా ప్రచారం సాగింది. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా అనిరుధ్ రవిచంద్రన్ ఎంపిక కూడా పూర్తయ్యిందని వార్తలు వచ్చాయి. 'పుష్ప- 2' తర్వాత ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని టాక్ వినిపించింది. దీంతో ఈ స్టార్ కాంబోలో సినిమా ఎప్పుడెప్పుడు ప్రారంభమౌతుందా అని బన్ని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇందులో ఓ ట్విస్ట్ జరిగింది.

ఈ కాంబో ప్రాజెక్ట్ అగ్రిమెంట్ క్యాన్సిల్ అయ్యిందంటూ వార్తలు వస్తున్నాయి. దర్శకుడు అట్లీ ఆ సినిమాకు భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఆశించారట. రూ.80 కోట్లు పారితోషికంగా అడిగినట్లు టాక్. అయితే ప్రొడక్షన్ డైరెక్టర్​కు అంత మొత్తంలో చెల్లించడానికి సిద్ధంగా లేదంట. అందుకే ప్రాజెక్ట్ అగ్రిమెంట్ రద్దు అయ్యిందని సమాచారం. దీంతో అట్లీ అదే కథను ఇంకో హీరోకు చెప్పారంట. ఏదేమైనా దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు.

ఇక గతేడాది అట్లీ- బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ లీడ్​ రోల్​లో 'జవాన్' తెరకెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ సినిమా రూ. 1000+ కోట్లు వసూల్ చేసింది. ఈ సినిమాతో అట్లీ క్రేజ్ సౌత్ ఇండస్ట్రీలో అమాంతం పెరిగిపోయింది. ఈ సినిమాలో సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్​గా నటించింది. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె ఓ పాత్రలో మెరిసింది. ఈ మూవీ సక్సెస్ తర్వాతే అట్లీ, బన్ని కాంబో ఫిక్స్ అయ్యిందిని అప్పట్లో కథనాలు వచ్చాయి.

పుష్ప- 2 వాయిదా!: సినీ లవర్స్​ ఎంతగానో ఎదురుచూస్తున్న అల్లు అర్జున్ 'పుష్ప- 2' సినిమా వాయిదా పడిందని తెలుస్తోంది. ఈ సినిమాను 2024 ఆగస్టు 15న రిలీజ్ చేస్తామని మేకర్స్ గతంలో ప్రకటించారు. అయితే అనుకున్న సమయానికి షూటింగ్ పనులు పూర్తయ్యే ఛాన్స్ లేనందున సినిమా వాయిదా వేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు ఇన్​సైడ్ టాక్. కానీ, దీనిపై అఫీషియల్ అనౌన్స్​మెంట్ రావాల్సి ఉంది.

అల్లు అర్జున్ - అట్లీ మూవీలో హీరోయిన్​ ఎవరంటే? - Atlee Allu Arjun Movie

అల్లు అర్జున్​తో పాన్ ఇండియా సినిమా! అట్లీ రెమ్యునరేషన్ అన్ని కోట్లా?

Last Updated : Jun 16, 2024, 10:04 AM IST

ABOUT THE AUTHOR

...view details