Alitho Saradaga Season 2 Latest Promo :నందమూరి నటసింహం బాలకృష్ణ క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడే ఇలా ఉందంటే ఒకప్పుడు ఆయన వయసులో ఉన్నప్పుడు ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఉండేవారో మీరే ఊహించుకోండి. సామాన్యులు మాత్రమే ఆయన్ని అభిమానిస్తారు అనుకుంటే పొరపాటే ఇండస్ట్రీలోనూ ఆయనకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా చాలా మంది హీరోయిన్లు ఇప్పటికీ బాలయ్య బాబంటే పడిచస్తారు. ఆయన్ని ఎంత ఇష్టపడతారంటే అలనాటి తార రాధ ఏకంగా టీవీ షోలోనే బాలయ్యకు ప్రపోజ్ చేశారు.
ఈటీవీలో ప్రసారమవుతున్న ప్రముఖ హాస్య నటుడు అలీ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఆలీతో సరదాగా సీజన్-2 షోకు ఒకప్పటి హీరోయిన్ రాధ స్పెషల్ గెస్ట్ గా వచ్చారు.ఈ ప్రోగ్రాంకు సంబంధించిన ప్రోమె తాజాగా రిలీజ్ అయింది. అందులో అలీ, నటి రాధ మధ్య చాలా సరదా సంభాషణ జరిగింది. ఆ అందాల తార జీవితానికి సంబంధించి చాలా ప్రశ్నలు అడిగారు హోస్ట్ అలీ. వాటికి ఆమె చాలా సంతోషంగా సమాధానం చెప్పారు. మాటల మధ్యలో రాధ ఆమెకు బాలయ్య బాబంటే ఎంత ఇష్టమో చెప్పుకొచ్చారు.
"స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ ఎవరొచ్చినా బాలయ్య ముందు నథింగ్ - ఐ జస్ట్ లవ్ హిమ్" అంటూ ఆయనపై ఆమెకున్న క్రష్ గురించి చెప్పుకొచ్చారు. అలాగే అప్పట్లో చిరంజీవి గారితో సమానంగా డ్యాన్స్ చేసేదాన్ని అంటూ సినీ కెరీర్లో ఆమె ఎదుర్కొన్న ఎన్నో అనుభవాలను అలీతో పంచుకున్నారు. మొత్తం మీద ఈ ప్రోమో చాలా ఆసక్తికరంగా అనిపించింది.
బర్త్ డే సెలబ్రేషన్స్‌లో సుమ - ఫర్ఫెక్ట్ టైమింగ్‌తో రాహుల్ రామకృష్ణ పంచ్‌లు
"నా వల్లనే ప్రాబ్లమ్ అయితుందంటే చెప్పురా.. ఎల్లిపోత నేను ఈడికెంచి" ఈ డైలాగ్ గుర్తందా.. అంత ఈజీగా మర్చిపోలేం లెండి."జాతిరత్నాలు" సినిమాలో ఈ ఒక్క డైలాగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వంచాడు నటుడు రాహుల్ రామకృష్ణ.యాక్టింగ్ తో పాటు తన ఫర్ఫెక్ట్ కామెడీ టైమింగ్ తో టాలీవుడ్ ప్రేక్షకుల మనసులో మరిచిపోలేని ముద్ర వేసుకున్నాడు రాహుల్.
ప్రతి శనివారం ప్రేక్షకులకు వినోదం పంచుతున్న "సుమ అడ్డా" షోలో ఈ వారం "ఓం భీం బుష్" సినిమా టీమ్ సందడి చేసింది. ఈ ఎపిసోడ్ కు సంబంధించి తాజాగా ప్రోమో విడుదల చేశారు. అందులో యాంకర్ సుమపై రాహుల్ రామకృష్ణ పంచులకు నవ్వకుండా అస్సలు ఉండలేం.రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కలిసి సుమపై పంచుల వర్షమే కురిపించారు. షోలో భాగంగా సుమ అడిగిన ప్రశ్నలకు కౌంటర్లు, సెటైర్లు వేస్తూ షోలో హాస్యాన్ని రెట్టింపు చేశారు రాహుల్ రామకృష్ణ.
ప్రోమోలో మరో ఆసక్తికర విషయం ఏంటంటే "ఓం భీం బుష్" సినిమా థీంకు తగ్గట్టుగా సుమపై శ్రీవిష్ణు, ప్రియదర్శి, సినిమా డైరెక్టర్ అంతా కలిసి మ్యాజిక్ చేసి ఆమెను దయ్యంలా మార్చి కామెడీ పుట్టించారు. అంతేకాదు ఈ షోలో సుమ కూడా కాసేపు కూమారీ ఆంటీగా కనిపించి నవ్వించారు. మార్చి 22న సుమ బర్త్ డే స్పెషల్ ట్రీట్ గా షోలో ఆమె చేత "ఓం భీం బుష్" సినిమా టీం కేక్ కట్ చేయించారు. అలాగే ఆమె అండగా ఉండి నడిపిస్తున్న వృద్ధాశ్రమం నుంచి కొందరిని అతిథులుగా తీసుకొచ్చారు. ఆద్యంతం హాస్యాన్ని నింపుకున్న ఈ ఎపిసోడ్ మార్చి 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.
'ఆలీతో సరదాగా సీజన్ 2' షురూ - ప్రభాస్‌తో మల్టీస్టారర్ - హింట్ ఇచ్చిన గోపిచంద్!
అమెరికాలో పెట్రోల్ బాయ్, టెర్రరిస్ట్ పాత్రలు ఇస్తారట! అందుకే అడవి శేష్ తెలుగు హీరో అయ్యారట!!