Aliabhatt 100 Most Influential People of 2024 : వరుస విజయాలతో దూసుకుపోతున్న బాలీవుడ్ ప్రముఖ నటి అలియాభట్ మరో అరుదైన గుర్తింపును సొంతం చేసుకుంది. టైమ్స్ మ్యాగజైన్ '100 మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్షియల్ పీపుల్ ఆఫ్ 2024’ లిస్టులో చోటు సంపాదించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎంపిక చేసిన అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల్లో అలియాభట్ స్థానం సంపాదించింది. దీంతో హాలీవుడ్ దర్శకుడు టామ్ హార్పర్ ఆమెపై ప్రశంసలు కురిపించారు. కాగా, అలియా 2023లో హార్ట్ ఆఫ్ స్టోన్ మూవీతో హాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ మూవీ డైరెక్టర్ టామ్ హార్పరే. ఈయన మ్యాగజైన్‌కు అలియా గురించి రాస్తూ, ఆమె ప్రతిభను కొనియాడారు. అలియా ట్రూలీ ఇంటర్నేషనల్ స్టార్ అని పేర్కొన్నారు.
అలియా సెట్‌లో నిరాడంబరంగా, ఫన్నీగా ఉంటుందని టామ్ రాసుకొచ్చారు. "అలియా చాలా సునాయాసంగా యాక్ట్ చేస్తుంది. ఎప్పుడూ ఫోకస్డ్‌గా ఉంటుంది. కొత్త ఐడియాలకు ఓపెన్‌గా ఉంటుంది అని చెప్పారు. మూవీ షూటింగ్ సమయంలో ఓ ఫేవరెట్ మూమెంట్‌ను కూడా షేర్ చేసుకున్నారు. ఓ సీన్‌ను అలియా ఇంప్రూవైజ్ చేసి, ఎమోషన్స్‌తో మరింత అందంగా మార్చింద"ని చెప్పారు.
కాగా, 2012లో వచ్చిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో అలియా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అనంతరం పలు హిట్ సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. 2022లో గంగూబాయి కతియావాడితో మరింత గుర్తింపు తెచ్చుకుంది. అప్పటి నుంచి వరుస విజయాలు అందుకుంటోంది. ఆర్ఆర్ఆర్, డార్లింగ్స్, బ్రహ్మాస్త్ర, రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీలో కనిపించింది. తర్వాత హాలీవుడ్ మూవీ హార్ట్ ఆఫ్ స్టోన్‌లో యాక్ట్ చేసింది.
- అలియా ఫ్యూచర్ ప్రాజెక్టులు ఇవే