తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

బిల్​గేట్స్​ మెచ్చిన ఇండియన్ సినిమా ఏంటో తెలుసా? - ఆ స్టార్ హీరోలంతా రిజెక్ట్ చేశారు! - BILL GATES FAVOURITE MOVIE - BILL GATES FAVOURITE MOVIE

Bill gates Toilet Ek Prem Katha : మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు, బిలినీయర్​ బిల్ గేట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రీసెంట్​గా కూడా ఆయన భారత పర్యటన చేశారు. చాలా సార్లు భారత్​పై ప్రశంసలు కూడా కురిపించారు. మరి ఆయనకు నచ్చిన ఇండియన్ మూవీ ఏంటో తెలుసా?

Getty Images
Bill gates (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : May 11, 2024, 3:09 PM IST

Bill gates Toilet Ek Prem Katha :ఇంట్లో బాత్రూం లేకపోతే ఎంత ఇబ్బందిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటి పరిస్థితిలో పోలిస్తే ఒకప్పుడు ఊర్లలో టాయ్ లెట్లు లేక మహిళలు ఎన్నో ఇబ్బందులు పడేవారు. అయితే ఇదే సమస్యపై 7 ఏళ్ల క్రితం ఓ సినిమా వచ్చింది బాక్సాఫీస్ వద్ద భారీ హిట్​ను అందుకుంది. అదే టాయ్ లెట్ ఏక్ ప్రేమ్ కథా. రిలీజ్ అయినప్పుడే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సక్సెస్ అందుకుంది.

అప్పట్లో ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. సామాన్యుల నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీల వరకు చాలా మంది ఈ టాయ్​లెట్​ ఏక్​ ప్రేమ్​ కథాపై ప్రశంసలు కురిపించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా సోషల్ మీడియాలో ఈ చిత్రాన్ని పొగుడుతూ పోస్ట్​ కూడా పెట్టారు. అంతలా ఈ చిత్రం అందరినీ మెప్పించింది.

అయితే ఈ చిత్రంపై కేవలం భారతీయులు మాత్రమే ప్రశంసలు కురిపించలేదు. ఏకంగా మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు, బిలినీయర్​ బిల్ గేట్స్ కూడా ప్రశంసించారు. "భారత దేశ శానిటేషన్​ ఛాలెంజ్​ను ప్రేక్షకుల్లో అవగాహన తెలిసేలా చేసింది ఈ టాయ్​లెట్​ ఏ లవ్ స్టోరీ చిత్రం" అంటూ ట్వీట్​లో గతంలో రాసుకొచ్చారు.

కాగా, అందరికీ ఇంతగా నచ్చిన ఈ టాయ్ లెట్ ఏక్ ప్రేమ్ కథా సినిమాకు శ్రీ నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించారు. "సినిమాలో హీరోగా చేసిన అక్షయ్ కుమార్ షూటింగ్ సమయంలో రాత్రి ఎంత లేట్ అయినా ఉదయాన్నే అందరికన్నా ముందుగా వచ్చేవారు. అసలీ అవకాశం ముందు పలువురు టాప్ హీరోలకు వెళ్లినా వారందరూ టాయ్ లెట్ కథ అనగానే రిజెక్ట్ చేశారు, కానీ అక్షయ్ కుమార్ మాత్రం ఈ కథ విని వెంటనే ఒప్పుకున్నారు. అక్షయ్ సెట్స్ పైకి రాగానే అంతా సవ్యంగా జరిగేది. ఆయన లేకపోతే ఈ షూటింగ్ పూర్తి చేయలేకపోయేవాడిని. బిల్ గేట్స్ కూడా మా సినిమా గురించి ట్వీట్ చేశారంటే, అసలు నాకు మాటలు రావడం లేదు. టాయ్ లెట్ లాంటి చిన్న బడ్జెట్ మూవీని అభినందించడం బిల్ గేట్స్ గొప్పదనం" అని గతంలో ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు నారాయణ్ సింగ్.

'ఎవరు గెలిస్తే నాకెందుకండి' - కల్కితో ముడిపెడుతూ ఎన్నికలపై నాగ్ అశ్విన్​ కామెంట్స్​! - Kalki 2898 AD Nag ashwin

వీకెండ్ స్పెషల్​ - OTTలో 25 క్రేజీ సినిమా/సిరీస్​లు స్ట్రీమింగ్​ - This Week OTT Releases Movies

ABOUT THE AUTHOR

...view details