Akkineni Nageswara Rao 100th Birth Anniversary:ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు 100వ జయంతి పురస్కరించుకుని ఫిల్మ్ ఫెస్టివల్ జరగనుంది. 'ఏఎన్ఆర్ 100- కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్' పేరిట ఈ రెట్రోస్పెక్టివ్ ఫెస్టివల్‌ను లాభాపేక్ష లేని సంస్థ ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ (FHF) నిర్వహించనుంది. అక్కినేని నాగేశ్వరరావు సినీ కెరీర్‌లో ఆణిముత్యాల్లాంటి 10 క్లాసిక్ సినిమాలను బిగ్ స్క్రీన్‌పై ప్రదర్శించనున్నారు. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదలైంది.
25 నగరాల్లో ఫిల్మ్ ఫెస్టివల్
హైదరాబాద్, ముంబయి, దిల్లీ, చెన్నై, బెంగళూరు వంటి ప్రధాన మెట్రో సిటీలు, వడోదర, జలంధర్, రూర్కెలా, వరంగల్, కాకినాడ, తుమకూరు వంటి చిన్న నగరాలతో సహా సహా సిటీల్లో సెప్టెంబర్ 20- 22 వరకు చలన చిత్ర మహోత్సవం జరగనుంది. అందులో భాగంగా 'దేవదాసు', 'మిస్సమ్మ', 'మాయాబజార్', 'భార్యాభర్తలు', 'గుండమ్మ కథ', 'డాక్టర్ చక్రవర్తి', 'సుడిగుండాలు', 'ప్రేమ్ నగర్', 'ప్రేమాభిషేకం', 'మనం' వంటి ఏఎన్ఆర్ సినిమాలను థియేటర్లలో ప్రదర్శించనున్నారు. అక్కినేని నాగేశ్వరరావు కుటుంబం, నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియా (NFDC), పీవీఆర్ ఐనాక్స్ సహకారంతో ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ దేశవ్యాప్తంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తోంది.
'లెజెండ్ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు స్మృతిలో ఆయన తెలుగు క్లాసిక్ మూవీస్‌ను ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబోతున్నందుకు ఆనందంగా ఉంది. 1953- 2014 వరకు కొనసాగిన ఏఎన్ఆర్ కెరీర్ లో భారీ హిట్లు ఉన్నాయి. అవి ఆయనలో ఉన్న నిఖాసైన నటుడిని చూసే అవకాశాన్ని ప్రజలకు ఇస్తాయి' అని చిత్ర నిర్మాత, ఎఫ్‌హెచ్ఎప్ డైరెక్టర్ శివేంద్ర సింగ్ దుంగార్ పుర్ వ్యాఖ్యానించారు.
'చాలా ఆనందంగా ఉంది'
తన తండ్రి కెరీర్‌లో ల్యాండ్ మార్క్ చిత్రాలను చిత్రోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందని అక్కినేని నాగేశ్వరరావు కుమారుడు, నటుడు అక్కినేని నాగార్జున అభిప్రాయపడ్డారు. 'దశాబ్దాలుగా ప్రజల హృదయాలు, మనసులో ఏఎన్ఆర్ సాధువు, మద్యపానం తాగే వ్యక్తిగా, రొమాంటిక్ హీరోగా నిలిచిపోయారు. అన్ని రకాల పాత్రలను ఏఎన్ఆర్ పోషించారు. అందుకే ఆయన్ను అందరూ నటసామ్రాట్ అంటారు.