Akhanda 2 :కరోనా చివరి దశ సమయంలో సినిమా రిలీజ్ చేస్తే అసలు థియేటర్లకు ప్రేక్షకులు వస్తారా లేదా అనే ఆలోచనలో పడిపోయిన మేకర్స్‌కు, చిత్రసీమకు ఊపిరిపోసిన సినిమా 'అఖండ'. 2021లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం సంచలన విజయాన్ని అందుకుంది. నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా వచ్చిన ఈ సినిమా థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌తో సౌండ్ మోగించింది. అయితే ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉంటుందని దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ అప్పుడే ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఈ సినిమా గురించి ఎటువంటి అప్డేట్ రాలేదు.
అయితే కొద్ది రోజుల క్రితం దర్శకుడు బోయపాటి శ్రీను గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై ఓ సినిమా చేయనున్నట్లు ఆ సంస్థ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. కానీ హీరో ఎవరనే డీటేయిల్స్‌ను మాత్రం చెప్పలేదు. మరోవైపు బోయపాటి అప్పటికే అల్లు అర్జున్, సూర్య(కోలివుడ్) కోసం కథలను కూడా సిద్ధం చేసుకున్నట్టు ప్రచారం సాగింది. ఇప్పుడా కథానాయకులు ఇద్దరు ప్రస్తుతం టాలీవుడ్లో ఇతర చిత్రాల షూటింగ్‌లతో ఫుల్ బిజీగా ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ - బోయపాటి శ్రీను(Balakrishna Boyapati Akhanda 2) కాంబో సినిమా గురించి తెరపై వార్తలు రావడం మొదలయ్యాయి. దీంతో అఖండ 2పై ప్రాధాన్యం సంతరించుకుంది. మరి ఈ కాంబోలో 'అఖండ 2'నే పట్టాలెక్కుతుందా లేక, వేరే కథతో సినిమా చేస్తారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. అఖండ 2 కోసం అయితే ఇప్పటికే స్క్రిప్ట్ కూడా రెడీగా ఉన్నట్లు సమాచారం అందించింది. సమీకరణలన్నీ కుదిరితే ఆ సినిమానే పట్టాలెక్కే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.