Ajay Devgn Upcoming Movies : బాలీవుడ్ స్టార్ యాక్టర్ అజయ్ దేవగణ్ గురించి చాలా మంది సినీ ప్రియులకు తెలిసే ఉంటుంది. ఓవైపు హీరోగా రాణిస్తూనే మరోవైపు పలు చిత్రాల్లో ఇతర కీలక పాత్రల్లో నటిస్తూ ముందుకెళ్తున్నారు. ఆయన హిందీ యాక్టర్ అయినప్పటికీ RRR చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అయితే నెక్ట్స్ ఆయన నుంచి రాబోయే సినిమాల జాబితా చూస్తే వాటిలో ఎక్కువగా సీక్వెల్సే ఉండటం విశేషం.
ఈ ఏడాది షైతాన్ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు అజయ్ దేవగణ్. త్వరలోనే మైదాన్ సినిమాతోనూ(Maidaan) అలరించనున్నారు. ఏప్రిల్ 10న ఇది రిలీజ్ కానుంది.
- ఈ చిత్రాల తర్వాత ఆయన నటించే చిత్రాలన్నీ దాదాపుగా సీక్వెల్సే. రాజ్‌కుమార్ గుప్త దర్శకత్వంలో రైడ్ చిత్రానికి కొనసాగింపుగా రైడ్ 2 రానుంది. వాణీకపూర్, రితేశ్ దేశ్‌ముఖ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
- సింగం అగైన్ కూడా ఇప్పటికే శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఆగస్టులో దీనిని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
- సన్ ఆఫ్ సర్దార్కు కొనసాగింపుగా మరో మూవీ పట్టాలెక్కనుంది. వర్తమానంలో జరిగే కథతో ఇది తెరకెక్కనుంది.
- అలానే ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్ దృశ్యం చిత్రాలకు కొనసాగింపుగా దృశ్యం 3ని దర్శకుడు జీతూ జోసెఫ్ సిద్ధం చేస్తున్నారు. స్క్రిప్ట్ పనులు కంప్లీట్ అవ్వగానే అజయ్ షురూ చేస్తారు.
- ఢమాల్ 4, గోల్‌మాల్ - 5లకు సంబంధించి కూడా స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయిందట.
- ఇక రకుల్ ప్రీత్ సింగ్‌తో కలిసి దే దే ప్యార్ దే-2 చేయనున్నారు. ఇందులో వయసు అంతరం ఉన్న ప్రేమికుడిగా కనిపించనున్నారు.
- లేటెస్ట్ హిట్ షైతాన్‌కు కొనసాగింపుగా షైతాన్ 2ను కూడా తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. ఈ విషయాన్ని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.